E-Paper
Advertisement

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!
Advertisement

Jio Satellites: రిలయన్స్ జియో.. అంతరిక్ష సమాచార రంగంలో (స్పేస్ కమ్యూనికేషన్స్) సరికొత్త విప్లవానికి తెరలేపింది. దాదాపు 1,600 లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలనే జియో ప్రతిపాదనకు.. భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్’ (IN-SPACe) సాంకేతికంగా ఆమోదం తెలిపింది. ఇస్రో (ISRO), టెలికాం శాఖ (DoT) లతో సంప్రదించిన తర్వాతే ఇన్-స్పేస్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశీయంగా రూపుదిద్దుకోనున్న మొట్టమొదటి భారీ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు ఇది కీలక ముందడుగు కావడం విశేషం.

అసలు జియో ప్లాన్ ఏంటి?

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో.. ఈ 1,600 ఉపగ్రహాల ద్వారా దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా ఏకంగా 4.5 నుంచి 5 టెరాబిట్స్ పర్ సెకండ్ (Tbps) సామర్థ్యంతో డేటాను అందించవచ్చు. ఉపగ్రహాల నిర్వహణ, నెట్‌వర్క్ సేవల కోసం దేశవ్యాప్తంగా 20 నుంచి 22 గ్రౌండ్ స్టేషన్లను జియో ఏర్పాటు చేయనుంది. అయితే కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా మొబైళ్లకు నేరుగా కనెక్టివిటీ ఇచ్చే ‘డైరెక్ట్-టు-డివైస్’ సేవలను కూడా అందించాలని జియో భావిస్తోంది.

రక్షణ రంగానికి కొండంత అండ

Advertisement

జియో తలపెట్టిన ఈ ప్రాజెక్టు వ్యాపార పరంగానే కాకుండా దేశ భద్రతా పరంగా ఎంతో వ్యూహాత్మకమైనది. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. విదేశీ శాటిలైట్ కమ్యూనికేషన్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఉపగ్రహాల్లో రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక పేలోడ్‌లను (డిఫెన్స్ పరికరాలు) అమర్చే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అదే నిజమైతే భారత జాతీయ భద్రతకు జియో నెట్‌వర్క్ ఒక కవచంలా మారుతుందని నిపుణులు అంటున్నారు.

గ్లోబల్ రేసులో జియో దూకుడు

గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ దిగ్గజాలతో పోలిస్తే జియో ప్రతిపాదన అత్యంత మెరుగ్గా ఉన్నట్లు ఇన్-స్పేస్ పేర్కొంది. అయితే ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ భారత్‌లో 600 గిగాబిట్స్ పర్ సెకండ్ (Gbps) సామర్థ్యానికి మాత్రమే అనుమతి పొందింది. అలాగే అమెజాన్‌కు చెందిన ‘ప్రాజెక్ట్ కైపర్’ 3 Tbps సామర్థ్యాన్ని ప్లాన్ చేస్తున్నప్పటికీ దానికి ఇంకా ఇన్-స్పేస్ ఆమోదం లభించలేదు. వీరిద్దరికంటే భిన్నంగా జియో ఏకంగా 5 Tbps సామర్థ్యాన్ని ప్రతిపాదించడంతో ఎక్కువ మంది వినియోగదారులకు ఏకకాలంలో అత్యుత్తమ సేవలు అందించే అవకాశం జియోకు దక్కనుంది.ట

Advertisement

Also Read: ఫ్రీ వైఫై వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లు ఒకటే పెట్టారా? అయితే మీ సేవింగ్స్ గోవిందా!

జియో ముందున్న సవాళ్లు ఏంటి?

ఈ అంతరిక్ష ప్రాజెక్ట్ కు ఇన్-స్పేస్ నుంచి సాంకేతిక అనుమతి లభించినప్పటికీ జియో ఆ శాటిలైట్లను నింగిలోకి పంపడానికి ముందు మరికొన్ని కీలక అడుగులు వేయాల్సి ఉంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ద్వారా ఆర్బిటల్ స్లాట్లను (కక్ష్యలో స్థలాన్ని) దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇతర గ్లోబల్ శాటిలైట్ల సిగ్నల్స్‌తో అంతరాయం కలగకుండా అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకోవడం, అలాగే దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టేషన్ల మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయడం వంటివి జియో ముందున్న ప్రధాన సవాళ్లుగా చెప్పవచ్చు.

Also Read: ఐటెల్ జెనో సిరీస్ లాంచ్.. ల్యాప్‌టాప్, ఫోన్, ఇయర్‌బడ్స్.. అన్నింటికీ ఒకే పవర్ బ్యాంక్!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×