E-Paper
Advertisement

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka: రైతులు పంట మార్పిడి చేసుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు కీలక సూచనలు చేశారు. శనివారం మీడియా ప్రకటన చేశారు. ఎల్ నినో ప్రభావం దేశం పై, రాష్ట్రంపై తీవ్రంగా ఉందన్నారు. ఆశించిన మేర వర్షాలు కురవని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఆరు తడి పంటలు వేయడం వల్ల రైతులు నష్ట పోకుండా ఉంటారన్నారు.

చెరువులు, కుంటలు, డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాధారిత పంటలు వేయద్దని మంత్రి సీతక్క సూచించారు. ఇప్పుడున్న పరిస్థితులో వర్షాధారిత పంటల వల్ల రైతులు నష్ట పోయే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయని, తాగునీరుకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Also Read: మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

తాగు నీరుని నిల్వ చేయాల్సిన అవసరముందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం నుంచి జల సిరి కార్యక్రమం మొదలవుతుందన్నారు. జల సిరి కార్యక్రమంలో ఇంటి కొక ఇంకుడు గుంత, ఊరు కోక ఊట కుంట, ప్రతీ పంటకు పంట కుంట నిర్మిస్తామన్నారు. ప్రతి ఒక్క నీటి బొట్టును ఈ కార్యక్రమం ద్వారా ఒడిసి పడతామన్నారు.

Advertisement

Also Read: KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×