E-Paper
Advertisement

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఢీ.. హైదరాబాద్ రావాల్సిన ఆకాశ ఎయిర్‌కు తప్పిన ప్రమాదం

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఢీ.. హైదరాబాద్ రావాల్సిన ఆకాశ ఎయిర్‌కు తప్పిన ప్రమాదం
Advertisement

Delhi Airport flight collision: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో గురువారం ఒక భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఆకాశ ఎయిర్ (Akasa Air), స్పైస్ జెట్ (SpiceJet) విమానాలు రన్‌వే సమీపంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఆకాశ ఎయిర్ విమానం (QP 1406) పార్కింగ్ బేలో నిలిపి ఉంచబడింది. అదే సమయంలో వెనక్కి వస్తున్న స్పైస్ జెట్ విమానం తోక భాగం, ఆగి ఉన్న ఆకాశ విమానాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి రెండు విమానాల రెక్కలు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. విమానం టేకాఫ్ కావడానికి ముందే ఈ ఘటన జరగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఆకాశ ఎయిర్ విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ అత్యవసరంగా కిందకు దించేశారు. వారిని సురక్షితంగా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు తరలించి, ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అప్ర‌మ‌త్తం అయింది. గ్రౌండ్ స్టాఫ్ లేదా పైలట్ల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందా అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపమా లేక సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం రెండు విమానాలను మరమ్మతుల కోసం హ్యాంగర్‌కు తరలించారు.

Read Also: మంగ్లీ వల్ల నాకు ప్రాణహాని ఉంది.. నాకు ఏమైనా జరిగితే మంగ్లీనే కారణం: హిమాకాంత్ రెడ్డి

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×