E-Paper
Advertisement

ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన రియల్ హీరో… చరిత్ర మర్చిపోయిన అసలైన వీరుడి ఎపిక్ స్టోరీ… చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ

ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన రియల్ హీరో… చరిత్ర మర్చిపోయిన అసలైన వీరుడి ఎపిక్ స్టోరీ… చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ
Advertisement

Biographical Adventure Drama OTT : ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం అంటే… శారీరక బలం ఉన్నంత మాత్రాన సాధ్యమయ్యే పని కాదు. ప్రాణాలను పణంగా పెట్టే ధైర్యం, ప్రకృతిపై అవగాహన, కఠినమైన శిక్షణ, ప్రతి అడుగులోనూ అప్రమత్తత అవసరం. ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరిన వారి పేర్లు ప్రపంచమంతా మారుమోగినా, ఆ విజయానికి వెనుక ఉన్న కొందరి కృషి మాత్రం ఎవ్వరికీ తెలీదు. అలాంటి చారిత్రక వ్యక్తి టెన్జింగ్‌ నార్గే జీవితాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందిన చిత్రం ‘టెన్జింగ్‌’ (Tenzing). ఇది పర్వతారోహణ సాహసగాథ మాత్రమే కాదు, తన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం పోరాడిన ఓ వ్యక్తి కథ కూడా. మరి ఈ ఇంట్రస్టింగ్ ఇంగ్షీషు బయోగ్రాఫికల్ మూవీని ఎక్కడ చూడవచ్చు ? అంటే…

కథలోకి వెళ్తే…

టెన్జింగ్‌ నార్గే (Tenzing Norgay) హిమాలయాల్లో పెరిగిన ప్రతిభావంతుడైన పర్వతారోహకుడు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరాలనేది అతని కల. అయితే అది అతనికి సాహసయాత్ర మాత్రమే కాదు, ఎందుకంటే ఆ పర్వతాన్ని అతను పవిత్రమైనదిగా భావిస్తాడు. మరోవైపు బ్రిటిష్‌ బృందానికి నాయకత్వం వహించే వారు పర్వతాన్ని అధిరోహించడమే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఒకే శిఖరాన్ని చేరాలనే లక్ష్యం ఉన్నా, దాన్ని చూసే విధానంలోనే ఇద్దరి ప్రపంచాల మధ్య తేడా కనిపిస్తుంది.

Advertisement

టెన్జింగ్‌ ప్రయాణంలో అతని భార్య దావా (Dawa) ప్రోత్సాహం కీలకంగా నిలుస్తుంది. ఎవరెస్ట్‌ యాత్రలో తన ప్రతిభకు తగిన స్థానం దక్కాలంటే, కేవలం సహాయకుడిగా కాకుండా ప్రధాన పర్వతారోహకుడిగా గుర్తింపు పొందాలని అతను కోరుకుంటాడు. యాత్ర కార్యదర్శి జిల్‌ హెండర్సన్‌ (Jill Henderson) కూడా అతనికి ఈ విషయంలో సపోర్ట్ గా నిలుస్తుంది. చివరకు బ్రిటిష్‌ పర్వతారోహకుల బృందంలో చోటు సంపాదించేందుకు అతను చేసే ప్రయత్నం కథలో ముఖ్యమైన భాగంగా మారుతుంది. మరి ఆ తరువాత ఏం జరిగింది ? ఆ పర్వతారోహణ ఎలా సాగింది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

‘టెన్జింగ్‌’ అక్టోబర్‌ 16 నుంచి యాపిల్‌ టీవీ (Apple TV)లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సుమారు 2 గంటల 5 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఇంగ్షీషులోనే స్ట్రీమింగ్ కానుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సాహస చిత్రాలు, పర్వతారోహణలోని ప్రమాదాలు, చరిత్రలో తగిన గుర్తింపు పొందని వ్యక్తుల జీవితాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం ప్రత్యేకంగా నచ్చవచ్చు.

Advertisement

Also Read : భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ

గెండెన్‌ ఫుంట్సోక్‌ (Genden Phuntsok) టెన్జింగ్‌ పాత్రలో నటించగా, టామ్‌ హిడిల్‌స్టన్‌ (Tom Hiddleston) ఎడ్మండ్‌ హిల్లరీగా కనిపిస్తారు. విల్లెమ్‌ డఫో (Willem Dafoe) కల్నల్‌ జాన్‌ హంట్‌ పాత్ర పోషించారు. జెన్నిఫర్‌ పీడమ్‌ (Jennifer Peedom) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1953లో జరిగిన చారిత్రక ఎవరెస్ట్‌ యాత్ర ఆధారంగా తెరకెక్కింది. ఎడ్మండ్‌ హిల్లరీతో కలిసి టెన్జింగ్‌ నార్గే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని తొలిసారిగా చేరిన వ్యక్తుల్లో ఒకరిగా చరిత్రలో నిలిచారు. అయితే ఈ చిత్రంలో టెన్జింగ్‌ వ్యక్తిగత ప్రయాణం, అతని విశ్వాసం, కృషి, గుర్తింపు కోసం చేసిన పోరాటాన్ని కూడా చూపించారు.

Tags

Related News

ఛారిటీ పార్టీకి వెళ్లిన స్టార్‌ హీరో… అగ్నిపర్వతం దగ్గర బలి… ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ ను డోంట్ మిస్

30 ఏళ్ల క్రితం మాయమైన చేపల పడవ మళ్లీ ప్రత్యక్షం…. మైండ్ బెండింగ్ మిస్టరీ

స్టేజ్‌పై నవ్వులు పూయించిన ఆ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా ? ఓటీటీలోకి ఆసక్తికరమైన డాక్యుమెంటరీ

చదువుకున్న స్కూల్‌కే టీచర్‌గా… పిల్లలతో ఈ మాజీ స్టూడెంట్ పడుతున్న కష్టాలు చూస్తే నవ్వులే నవ్వులు

భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ

బర్త్‌డే పార్టీకి వెళ్లి తుఫానులో… ఒక్కొక్కరి నిజ స్వరూపం చూస్తే మైండ్ బ్లాక్… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డార్క్ కామెడీ

ఫ్రెండ్స్‌తో కలిసి కేఫ్‌ మొదలుపెడితే… మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని గుర్తుచేసే మలయాళం కామెడీ సిరీస్ తెలుగులో

Big Stories

Advertisement
×