E-Paper
Advertisement

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!
Advertisement

‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ ఈ పాట నాటి ప్రభుత్వ వైద్యం తీరును కళ్లకు కట్టింది. లక్షల్లో జీతాలు తీసుకుంటూ అవి సరిపోలేదనే రీతిలో పక్క చూపులు చూస్తూ వ్యాపారాలు చేసేందుకు తెగబడిన కొందరు బడి పంతుళ్ల తీరు కారణంగా.. తెలంగాణ జనం ‘నేను పంపను బిడ్డో ఈ సర్కారు బడుల చదువులకు..!’ అని అనుకునేలా చేస్తున్నారు.

సర్కార్‌ నుంచి నెలకు లక్షల్లో జీతం. కానీ ఇంకేదో కావాలి. ఇంకా సంపాదించాలి. ఆస్తులు కూడబెట్టాలి. గవర్నమెంట్‌ టీచర్‌ అంటేనే మంచి వెసులుబాటు, టైం దొరికే జాబు. దీనికి డుంకీ కొట్టి.. పిల్లలకు పాఠాలు చెప్పే ఆ టైంను బిజినెస్‌కు కేటాయిస్తే.. పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దితే నాకేం వస్తుంది..? అదే వ్యాపారాలు చేస్తే కోట్లు కూడబెట్టుకోవచ్చు..! ఇదే చేస్తున్నారు చాలా మంది.

Advertisement

చాలా మంది అంటే.. దాదాపు 20వేల మంది వరకు ఇలాంటి చీటింగ్‌ టీచర్లే ఉన్నారు తెలంగాణలో. వీరికి లక్షల్లో జీతాలుంటున్నాయి. కానీ బడులకు రారు. పాలకులు ఎవరున్నా.. ప్రభుత్వాలేవున్నా.. నిబంధనలు ఎన్ని తెచ్చినా… తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ..! అనే పాలసీనే అవలంభిస్తారు వీళ్లు.

ఈ ఎగనామం కమర్శియల్ పంతుళ్ల లిస్టు బయటకు తీసినా.. ఏమీ చేయలేకపోతోంది సర్కార్‌. ఫేస్‌ రికగ్నైజింగ్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌సీ) పెట్టినా .. అది కూడా మమ్మల్నేం చేయలేవని బరితెగించి మరీ తిరుగుతున్నారు. బడులకు డుమ్మాలు కొడుతున్నారు. రూరల్ ఏరియాల్లో ఉన్న పంతుళ్లు చిట్టీల నిర్వహణ, ఫైనాన్సులు ఇచ్చుడు, సిటీలో, సిటీ శివారుల్లో పనిచేసే టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. ఫైనాన్సులు, హోటళ్ల నిర్వహణ.. వీటిపైనే దృష్టి పెడుతున్నారు.

Advertisement

ఉత్తమ ఉపాధ్యాయులు అనిపించుకోవాలని వీరికి ఏ కోశానా లేదు. కానీ సర్కార్‌ ఇచ్చే జీతాలు మాత్రం టంచనుగా, పూర్తిగా కావాలి. ఉత్తమ బిజినెస్‌మెన్‌లుగా పేరు తెచ్చుకునేందుకు మాత్రం ఒకరికి మించి ఒకరు పోటీలు పడుతున్నారు. ఇదే తంతు జరుగుతోంది దశాబ్దాలుగా. పాలకులు మారినా.. వీరి తీరు మారడం లేదు. ఎందుకంటే వీరికి అండగా ఉంటున్నది అధికారులు. ఆపైన ఉండే నేతలు.

రాజకీయాలు మారినా..  ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. యూనియన్‌ ముసుగులో.. ఆ యూనియన్‌ లీడర్లతో కలిసి ఫైరవీలు చేసుకుని తమ ఉద్యోగాలు కాపాడుకుంటారు. సర్కార్‌ జీతాలు పొందుతారు. తమ జీవితాలు ఇలాగే ఉంటాయి.. ఏం చేసుకుంటారో చేస్కోండని విర్రవీగుతారు. ఇలా వ్యాపారాలు చేసేవాళ్లు, బడికి డుమ్మాలు కొట్టే మాస్టర్ల లిస్టులను బయట పెట్టినా.. షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టడం, సీరియస్‌ చర్యలు లేకపోవడంతో ఇది షరా మామూలుగానే మారిపోతోంది.

దీంతో సర్కారీ విద్యపై ఆధారపడిన పేద, మధ్యతరగతి ప్రజల పిల్లల చదవులు అంధకారంగా మారుతున్నాయి. సమాచారం లేకుండా డుమ్మా కొట్టి, ముఖ గుర్తింపు హాజరు (FRS) వేయని 183 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు హైదరాబాద్ కలెక్టర్ ఇటీవల ఒకేసారి షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టించింది.

మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న 28 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటూ, స్కూల్ వేళల్లో ప్రైవేటుగా అక్రమ చిట్టీల వ్యాపారం (Chit Fund Business) నిర్వహిస్తున్నట్లు ఆధారాలు దొరకడంతో ఒక గణిత ఉపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్ చేశారు.

విద్యాశాఖ తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం… ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వరుసగా ఒక సంవత్సరం పాటు డుమ్మా కొట్టి వ్యాపారాలు చేసుకునే లాంగ్ ఆబ్సెంట్ టీచర్లను ఇకపై విచారణ లేకుండానే ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయనున్నారు. కేవలం నెల రోజుల పాటు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరైన వారిని కూడా కఠినంగా శిక్షించేలా చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యోగాలు పోకుండా ఎలా కాపాడుకోవాలో, లొసుగులను ఎలా ఉపయోగించుకోవాలో, ఫైరవీలు ఎలా చేసుకోవాలో మరిగిన పంతుళ్లకు సర్కార్‌ ఎన్ని నిబంధనలు తెచ్చినా వారినేం చేయలేకపోతున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, CCS Conduct Rules, 1964ను అనుసరించి.. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలాంటి ప్రైవేటు వ్యాపారాలు చేయకూడదు. కానీ తెలంగాణలో దాదాపు 20వేల మంది వరకు పాలకులు, అధికారుల కళ్లుగప్పి… లొసుగులను ఆధారం చేసుకుని ఉత్తమ బిజినెస్‌మెన్‌లుగా మారుతున్నారు. పిల్లలకు చదవులు దూరం చేసి.. మధ్యలో ఆ చదువులు అటకెక్కడానికి వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగాా కారకులవుతున్నారు. దోషులుగా నిలుస్తున్నారు.

పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి:

 

డి. సత్యానంద్ TSUTF
రాష్ట్ర కార్యదర్శి

విధులకు డుమ్మా కొట్టి వ్యాపారం చేసేవారు కొందరే ఉన్నా మొత్తం వ్యవస్థకు అపాదించడం సరికాదు. విధులకు డుమ్మాకొట్టి ఇతర వ్యాపకాలు చేస్తున్నవారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వారిని కాపాడే ప్రయత్నం చేసే సంఘ నాయకులను ప్రభుత్వ పెద్దలు దూరం పెట్టాలి.

ఒక్కో ప్రభుత్వం తమ ఏలుబడిలో ఒక్కోరకమైన కొత్త స్కూల్ ప్రారంభిస్తున్నారు కానీ ఆల్రెడీ ఉన్న స్కూల్స్ ని బలోపేతం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యా శాఖ బడ్జెట్ ని కనీసం 20 శాతానికి తగ్గకుండా కేటాయించాలి.

కొత్త బడులు కాదు.. ఉన్న బడులను అభివృద్ధి చేయండి. పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయండి. డుమ్మా టీచర్స్ పై చర్యలు తీసుకోండి.
FRS వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి.

పర్యవేక్షణ వ్యవస్థను రెగ్యులర్ ఆఫీసర్స్ తో బలోపేతం చేయడంలో గడిచిన రెండు దశబ్దాల పైబడి ఏలిన పాలకులు వైఫల్యం చెందారు. ఇంచార్జి వ్యవస్థతో నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్ DEO లు, MEO లు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు. ముందుగా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి.

Tags

Related News

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

Big Stories

Advertisement
×