Delhi Tiranga Yatra: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభీజిత్ దీప్కే ఇవాళ నిర్వహించతలపెట్టిన ‘తిరంగా యాత్ర’ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. సెంట్రల్ పార్క్లో నిర్వహించాలనుకున్న ఈ యాత్రను నిలిపివేయాలని ఆదేశిస్తూ దీప్కే నివాసానికి చేరుకుని నోటీసులు అందజేశారు. మరోవైపు పాలనా పరమైన కారణాల వల్ల సెంట్రల్ పార్క్ను శుక్ర, శనివారాల్లో మూసివేస్తున్నట్లు న్యూడిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) ప్రకటించింది.
పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై అభిజిత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. తాము ఎటువంటి హింసకు పిలుపునివ్వలేదని.. కేవలం చేతుల్లో జాతీయ జెండాను పట్టుకొని శాంతియుతంగా నిరసన ర్యాతీ తీస్తామని చెప్పారు. హింసను ప్రేరేపించినట్లు రుజువైతే ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ‘నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఏది తోస్తే అది రాసి నోటీసులు ఇస్తారా? నేను ఎక్కడైనా హింసను ప్రేరేపించినట్లు ఒక్క వీడియో చూపించగలరా? అదే జరిగితే నన్ను ఉరితీసేయండి’ అని పోలీసులను ప్రశ్నించారు.
Also Read: తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!
మరోవైపు కానాట్ ప్లేస్ వ్యాపారుల సంఘం (NDTA) నిరసనకారులకు విజ్ఞప్తి చేస్తూ వ్యాపార ప్రాంతాలను ధర్నాలకు వేదికగా మార్చవద్దని కోరింది. గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఆందోళనల వల్ల స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోందని వాపోయింది. కాగా, ఈ వారంలోనే బొంబాయి నుండి డిల్లీ వచ్చిన విమానంలోకి పోలీసులు ప్రవేశించి అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదనే షరతుపై వారిని విడుదల చేశారు.
Also Read: యూట్యూబ్లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?