E-Paper
Advertisement

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!
Advertisement

Hyundai Telangana: తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో హ్యుందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రానికి సంబంధించిన పెండింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, జహీరాబాద్‌లో ప్రతిపాదిత ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 678 ఎకరాల్లో విడతలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Advertisement

కాగా, ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఆర్‌ అండ్‌ డీ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి… అవసరమైన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

ఇదిలా ఉంటే హ్యుందాయ్ సంస్థకు హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. హైటెక్ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు మద్దతునిస్తూ కీలక ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సామర్థ్యాలను మరింత విస్తరించేలా జహీరాబాద్‌లో గ్లోబల్ ఆర్‌అండ్‌డీ, మెగా టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా వాహనాల రూపకల్పన, పరీక్షలు, పనితీరు, ధ్రువీకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతోపాటు ఇంజినీరింగ్ ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలగనుంది. హ్యుందాయ్ అధునాతన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

Also Read: ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

దేశంలో తెలంగాణ భౌగోళికంగా మధ్యలో ఉందని, హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన నగరమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోని ఆరు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సురక్షితమైన, జీవించడానికి అనుకూలమైన కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కార్ల తయారీ పరిశ్రమకు అవసరమైన రవాణా, మౌలిక సదుపాయాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలతోపాటు భవిష్యత్తులో ఓడరేవులకు హైస్పీడ్ కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్ల అభివృద్ధితో వాహన తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.

Also Read: బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Tags

Related News

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న ఆరు కార్లు, హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన

కరువును ఎదిరించి.. ఎండిన పొలాలను తడిపి.. చిన్నమాధారం అన్నదాతల భగీరథ ప్రయత్నం!

జర్నలిస్టుకు అండగా బిగ్ టీవీ చైర్మెన్ .. TWJF అభినందనలు

మోడల్ స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. లక్షల రూపాయలు ఇక సేఫ్!

Big Stories

Advertisement
×