వేసవి కాలంలో కూలర్ చాలా మందికి సహాయకరంగా ఉంటుంది. కానీ కూలర్ శబ్దం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ శబ్దం నిద్రకు అంతరాయం కలిగించి, మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు, సరైన నిర్వహణతో కూలర్ శబ్దాన్ని బాగా తగ్గించవచ్చు. ఈ చిట్కాలు కూలర్ పనితీరును మెరుగుపరచి, గదిని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.
కూలర్ శబ్దానికి ప్రధాన కారణం దుమ్ము. ఫ్యాన్ బ్లేడ్స్, కూలింగ్ ప్యాడ్స్, వాటర్ ట్యాంక్‌లో దుమ్ము చేరడం వల్ల శబ్దం పెరుగుతుంది. క్రమం తప్పకుండా సాఫ్ట్ బ్రష్, గుడ్డతో శుభ్రం చేయాలి. శుభ్రమైన కూలర్ సాఫ్ట్‌గా పని చేసి తక్కువ శబ్దం చేస్తుంది.
కూలర్‌లో లూజ్‌గా ఉన్న స్క్రూలు, నట్స్ లాంటి భాగాల రాపిడి వల్ల శబ్దం చేస్తాయి. అన్ని భాగాలను జాగ్రత్తగా పరిశీలించి, సరైన టూల్స్‌తో బిగించాలి. ఇలా చేయడం వల్ల శబ్దం తగ్గడమే కాకుండా కూలర్ జీవితకాలం కూడా పెరుగుతుంది.
అసమానంగా ఉండే స్థలంపై ఉంచితే వైబ్రేషన్ పెరిగి శబ్దం పెరుగుతుంది. కూలర్‌ను స్థిరమైన, ఫ్లాట్ ఫ్లోర్‌పై ఉంచండి. రబ్బర్ మ్యాట్ ఉంచితే వైబ్రేషన్‌ను గ్రహించి శబ్దం తగ్గుతుంది.
మోటార్‌లో ఆయిల్ లేకపోతే అది పోడిబారి గ్రైండింగ్ శబ్దం చేస్తుంది. సరైన మోటార్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి లూబ్రికేట్ చేయాలి. ఇది ఫ్యాన్ సాఫ్ట్‌గా తిరగడానికి సహాయపడి శబ్దాన్ని తగ్గిస్తుంది.
పగిలిన లేదా బెండ్ అయిన బ్లేడ్స్ ఇంబ్యాలెన్స్ సృష్టించి ఎక్కువ శబ్దం చేస్తాయి. బ్లేడ్స్‌ను పరిశీలించి, డ్యామేజ్ అయితే వెంటనే మార్చాలి. బ్యాలెన్స్ ఉన్న బ్లేడ్స్ శబ్దం తగ్గించి, ఎయిర్ ఫ్లోను మెరుగుపరుస్తాయి.
కూలర్ ఫుల్ స్పీడ్‌లో నడపడం వల్ల శబ్దం ఎక్కువవుతుంది. రాత్రి సమయంలో మీడియం స్పీడ్‌లో ఉపయోగించండి. ఇది శబ్దం తగ్గించడమే కాకుండా విద్యుత్ ఆదా కూడా చేస్తుంది.
Also Read: రీల్స్ చూస్తూ నిద్ర రావడం లేదా? జీవితంలో ప్రశాంతత కోసం డిజిటల్ డిటాక్స్ ఇలా చేయండి
గాలి ప్రసరణ లేకపోతే కూలర్ ఎక్కువగా పని చేసి శబ్దం చేస్తుంది. కిటికీలు కొంచెం తెరిచి ఉంచండి. మంచి వెంటిలేషన్ ఉంటే కూలర్ సాఫ్ట్‌గా పని చేస్తుంది.
గదిలో కర్టెన్స్, కార్పెట్స్, కుషన్స్ శబ్దాన్ని గ్రహిస్తాయి. దీని వల్ల గది ప్రశాంతంగా ఉంచుతాయి.
కూలర్ శబ్దం సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. శుభ్రం చేయడం, లూజ్ భాగాలు బిగించడం, ఆయిలింగ్, సరైన ఉపయోగం వంటి చిట్కాలు అనుసరిస్తే కూలర్ తక్కువ శబ్దంతో మంచి కూలింగ్ ఇస్తుంది. ఈ చిన్న మార్పులు చేస్తే వేసవి సౌకర్యవంతంగా ఉంటుంది.