E-Paper
Advertisement

Dog Fights Tiger : వీరశునకం.. యజమానిపై పులి దాడి.. తరిమికొట్టిన కుక్క..

Dog Fights Tiger : వీరశునకం.. యజమానిపై పులి దాడి.. తరిమికొట్టిన కుక్క..

Dog Fights Tiger To Save Owner | పెంపుడు జంతువుల్లో మనిషికి అత్యంత నమ్మకంగా ఉండే ప్రాణి కుక్క. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. ఇంటిని కాపలాకాయడమే కాదు. అవసరమైతే యజమానిని కాపాడడానికి ఎంతకైనా పోరాడుతుంది. వెనుకడుగు వేయదు. తాజాగా ఈ దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లో ఒక కుక్క తన యజమాని పట్ల చూపించిన విధేయతతో వార్తల్లో నిలిచింది. యజమానిని కాపాడేందుకు పులితో వీరోచితంగా పోరాడి పై చేయి సాధించింది. కుక్క పోరాట పటిమకు పులి బెదిరిపోయింది. అయితే చివరికి కుక్క ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఉమారియా జిల్లాలోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ పక్కనే ఉన్న భార్హుట్ గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శివమ్ అనే వ్యక్తి తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా.. అకస్మాత్తుగా అక్కడికి పులి వచ్చింది. శివమ్ పై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న శివమ్ పెంపుడు కుక్క (జర్మన్ షెపర్డ్ జాతి శునకం) తన ప్రాణాలను లెక్కచేయకుండా పులిపై దాడి చేసింది. ఈ రెండు జంతువుల మధ్య కొంతసేపు తీవ్రమైన పోరాటం జరిగింది. కానీ కుక్క ధైర్యం, తెగింపు చూసి పులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఈ పోరాటంలో కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా యజమాని ఒంటి మీద గీత పడకుండా కాపాడుకుంది. ఈ క్రమంలో యజమాని పట్ల కుక్క చూపించిన విధేయతకు అందరూ ప్రశంసిస్తున్నారు.

Also Read:  తస్మాత్ జాగ్రత్త.. కొత్త కొత్త విధానాల్లో చోరీలు చేస్తున్న దొంగలు.. ఎలాగంటే?..

కుక్క తెగింపుకి పారిపోయిన పులి
“నేను పొలంలో ఉన్నాను. అకస్మాత్తుగా పులి వచ్చి నాపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అంతలో నా పెంపుడు కుక్క పులిపై దాడి చేసింది. ఈ పోరాటంలో నా కుక్క తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత పులి దాన్ని గ్రామం పొలిమేరలోకి లాక్కెళ్లింది. అక్కడ దాన్ని విడిచిపెట్టి పారిపోయింది” అని జర్మన్ షెపార్డ్ కుక్క యజమాని శివమ్ తెలిపాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుక్క మృతి
తీవ్రంగా గాయపడిన కుక్కను వెంటనే పశువైద్యుడు డాక్టర్ అఖిలేశ్ సింగ్ వద్దకు తీసుకెళ్లామని శివమ్ తెలిపాడు. అక్కడ వైద్యుడు కుక్కను కాపాడటానికి తన శాయశక్తులా ప్రయత్నించారని పేర్కొన్నాడు. కానీ కుక్కను రక్షించలేకపోయారని వెల్లడించాడు. తీవ్ర గాయాలతో తన పెంపుడు కుక్క మరణించిందని చెప్పాడు.

జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క మెడపై తీవ్ర గాయాలు, దాని శరీరంపై పులి పంజా గుర్తులు ఉన్నాయని వైద్యుడు అఖిలేశ్ సింగ్ తెలిపారు. ఈ గాయాలు చాలా లోతుగా ఉన్నాయని వెల్లడించారు. చికిత్స తర్వాత కుక్క వెంటనే నడిచిందని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు విడిచిందని చెప్పారు.

ఈ ఘటన.. కుక్క మరణంతో జంతు ప్రేమికుల హృదయం కలిచివేస్తుంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×