BigTV English

Vitamin Deficiency: తరచూ అలసటగా అనిపిస్తోందా ? అస్సలు లైట్ తీసుకోవద్దు !

Vitamin Deficiency: తరచూ అలసటగా అనిపిస్తోందా ? అస్సలు లైట్ తీసుకోవద్దు !

Vitamin Deficiency: విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా మీకు అలసటగా అనిపిస్తుందా ? ఇది అలసటకు సంకేతం మాత్రమే కాదు.. తీవ్రమైన అనారోగ్యానికి కూడా సంకేతం కావచ్చు. పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, థైరాయిడ్, రక్తహీనత, అనేక ఇతర సమస్యలు కూడా అలసటకు కారణమవుతాయి. మీరు ఏ పని చేయకుండానే అలసిపోతుంటే మాత్రం కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


ఎక్కువ పని చేయడం లేదా పరిగెత్తడం వల్ల అలసటగా అపినిస్తుందని మీరు వినే ఉంటారు. ఏదో ఒక పని చేయడం వల్ల మనకు శారీరకంగా, మానసికంగా అలసట కలుగుతుంది. కానీ మీరు విశ్రాంతి తీసుకున్నా, ఎలాంటి పని చేయకపోయినా కూడా అలసిపోయినట్లు అనిపిస్తే.. దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇది ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం కావచ్చు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. పోషకాల లోపం:
శరీరంలో పోషకాల లోపం వల్ల తరచుగా అలసటగా అనిపిస్తుంది. శరీరానికి సరైన పోషకాహారం అందకపోతే అది అలసట, బలహీనతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా శరీరంలో ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవ్వదు. . నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, దాదాపు 30% మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీంతో పాటు, విటమిన్ డి , బి12 లోపం కూడా అలసటకు కారణమవుతుంది. కాబట్టి, మన శరీరానికి సరైన పోషకాలను అందించడం చాలా ముఖ్యం.


2. నిరాశ (మానసిక ఒత్తిడి):
ఒత్తిడి, నిరాశ శరీర శక్తిని హరించివేస్తాయి. ఒత్తిడి లేదా ఆందోళన ఎక్కువ కాలం కొనసాగితే, అది శరీరంలో కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. దీని కారణంగా నిద్ర కూడా ప్రభావితం అవుతుంది. ఫలితంగా ఎలాంటి పని చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.

3. రక్తహీనత , థైరాయిడ్ :
రక్తహీనత , థైరాయిడ్ వంటి సమస్యలు కూడా శరీరంలో అలసట, బలహీనతకు కారణమవుతాయి. శరీరం తగినంత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు రక్త హీనత కలుగుతుంది. దీని కారణంగా ఆక్సిజన్ సరిగ్గా పంపిణీ చేయబడదు . అందుకే తరచుగా అలసటగా అనిపిస్తుంది. ఇదే కాకుండా థైరాయిడ్ సమస్యలో కూడా శరీరంలో అలసటగా అనిపిస్తుంది.

4. ఇతర కారణాలు:
ఎవరికైనా స్లీప్ అప్నియా సమస్య ఉంటే.. నిద్రపోతున్నప్పుడు పదే పదే శ్వాస తీసుకోవడం ఆగిపోతే ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా శరీరంలో అలసటను కలిగిస్తుంది. అదేవిధంగా, లూపస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ , రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు శరీర రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తాయి. దీని వల్ల శక్తి స్థాయిలు తగ్గుతాయి. అంతే కాకుండా అలసట ఏర్పడుతుంది. శరీరంలో అధిక రక్తంలో చక్కెర సమస్య ఉంటే, శరీర శక్తిని సరిగ్గా ఉపయోగించలేము. ఇది అలసట సమస్యను కూడా పెంచుతుంది.

Also Read: జుట్టుకు రంగు వేస్తున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి !

ఏ పని చేయకుండా అలసిపోయినట్లు అనిపిస్తే ఏం చేయాలి ?

మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ నిరంతరం అలసిపోయి, బలహీనంగా అనిపిస్తే, అది ఏదో తీవ్రమైన సమస్య జరుగుతుందనడానికి సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఈ సమస్యను అస్సలు లైట్ తీసుకోవద్దు. వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమ మార్గం. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి సరైన చికిత్స ఇస్తారు. మీరు ఏ పని చేయకుండానే అలసిపోయి బలహీనంగా అనిపిస్తే, అది సాధారణ విషయం కాదు. ఇది మీ ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావచ్చు. దీనికి సకాలంలో చికిత్స అవసరం. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరిగ్గా తినండి.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×