IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ప్రారంభానికి 18 రోజుల ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి {బీసీసీఐ}.. జట్ల ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించి కొత్త ఆంక్షలు విధించింది. ఇంతకుముందు సీజన్ ల మాదిరిగా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రాక్టీస్ స్టేషన్ లు నిర్వహించే వెసులుబాటును నిషేధించింది. ప్రాక్టీస్ సెషన్ లకు పరిమితులను విధించింది. కొత్త ఆంక్షల ప్రకారం ఒక్కో జట్టు ఏడు ప్రాక్టీస్ సెషన్ మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది.
Also Read: Congress- Rohit: ఇంత బరువు ఉన్నాడు… రోహిత్ పై కాంగ్రెస్ మహిళా నేత బాడీ షేమింగ్ కామెంట్స్ !
అలాగే రెండు ఫార్మాట్ మ్యాచులు మాత్రమే అనుమతించబడతాయి. ఇక మ్యాచ్ ఉన్న రోజుల్లో స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం ఉపయోగించకూడదు. అంతేకాకుండా ఐపీఎల్ వేదికలలో ఇతర టోర్నీల నిర్వహణకు అనుమతి లేదు. ప్రాక్టీస్ మ్యాచ్ లు ప్రధాన స్క్వేర్ లోని సైడ్ వికెట్లలో ఒకదానిపై జరగాలి. ఫ్లడ్ లైట్ల కింద కేవలం 3:30 గంటలు మాత్రమే ప్రాక్టీస్ కి అనుమతి ఉంటుంది. ఆపరేషన్ రూల్స్ ప్రకారం ప్రాక్టీస్ మ్యాచ్ లకు బీసీసీఐ ముందస్తు వ్రాతపూర్వక అనుమతి అవసరం ఉంటుంది.
ఈ రూల్స్ లో అతిపెద్ద మార్పు ఏంటంటే.. మ్యాచ్ రోజుల్లో జట్లను ప్రాక్టీస్ చేయడానికి అనుమతించరు. అంటే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ సెషన్లను ముందుగానే పూర్తి చేసుకోవాలి. మ్యాచ్ రోజున వార్మప్ లేదా ప్రాక్టీస్ కోసం స్టేడియాల సౌకర్యాలను ఉపయోగించుకోకూడదు. సీజన్ కోసం పిచ్ ని సిద్ధం చేయడానికి సంబంధిత ఫ్రాంచైజీ సీజన్ లో మొదటి హోమ్ మ్యాచ్ కి ముందు నాలుగు రోజుల్లో ప్రధాన స్క్వేర్ లో ఎటువంటి ప్రాక్టీస్ సెషన్ లు లేదా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకూడదు.
ఒకవేళ రెండు జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే.. సెషన్ల వారిగా అవకాశం ఇస్తారు. రెండు జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే బీసీసీఐ ఓ పద్ధతిని ప్రతిపాదించింది. రెండు జట్ల నిర్వాహకుల మధ్య బోర్డు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఒక సెషన్ ఒకరు, మరొక సెషన్ మరొకరు అన్నట్లుగా సమయాన్ని పంచుకోవచ్చు. ఈ మేరకు కొత్త నిబంధనలను బీసీసీఐ నోట్ ద్వారా ఐపీఎల్ జట్లకు తెలియజేసింది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ మార్చ్ 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.
Also Read: Champions Trophy 2025: సెమీస్ కు వర్షం ఎఫెక్ట్…టీమిండియాకు భారీ నష్టమేనా ?
ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచ్లు 65 రోజుల పాటు జరుగుతాయి. ఈ టోర్నీలోని తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ కి కూడా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ మెగా లీగ్.. ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం 18వ సీజన్ కి సమాయత్తమవుతుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం 10 జట్లు ఉన్నాయి. 2002లో గుజరాత్, లక్నో జట్లు ఈ లీగ్ లో అడుగుపెట్టాయి.