Thieves Trap Robbery | త్వరగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలు చేసేవారు.. ఇప్పుడు కొత్త కొత్త విధానాలు అవలంబిస్తున్నారు. ప్రజలు, పోలీసులు జాగ్రత్తగా ఉండడంతో దొంగలు తమ పనిలో ఫెయిల్ కాకుండా ఉండడానికి ట్రాపింగ్ విధానంలో హింసాత్మకంగా చోరీలు చేస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్‌లోని ఒక ఇంట్లో.. రాత్రి ముగ్గురు దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. వారు ఇంటి ముందున్న బోర్ మోటార్‌ను ఆన్ చేసారు. నీటి శబ్దం విని ఇంటి యజమాని భార్య బయటకు వచ్చి చూస్తుండగా, ఆమెను కత్తితో బెదిరించి ఇంట్లో ఉన్న 80 తులాల బంగారం, రూ.7 లక్షల నగదును దోచుకెళ్లారు. పోలీసుల దర్యాప్తులో ఈ దొంగతనంలో బంధువల హస్తం ఉందని తేలింది.
సిరిసిల్ల పట్టణంలోని ఒక వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రాత్రి వేళ ఒక దొంగ ఆమె ఇంటి తలుపులు కొట్టి, తెలిసినవారిలా పిలిచి పక్కన దాక్కున్నాడు. ఆమె బయటకు వచ్చి చూస్తుండగా.. కర్రతో ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చేలోపు ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.
సొంత మనుషుల్లా ముందే రెక్కీ చేసి..
ఇదివరకు ఇంటి తాళం పగులగొట్టి దొంగతనాలు చేసేవారు. ఈ మధ్యకాలంలో చోరీ చేసే విధానాన్ని మార్చారు. ఇంట్లో పని చేయడానికి వచ్చి, వారితో సొంత మనుషుల్లా ఉంటూ పూర్తి నమ్మకాన్ని కలిగిస్తారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకున్నాక చోరీకి పాల్పడి ఇతర ప్రాంతాలకు పారిపోతారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నాయి. ముఖ్యంగా చంటి పిల్లల ఏడుపు శబ్దాలు లేదా ఎవరో పిలుస్తున్నట్లుగా ఇంట్లో వారిని బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: 100 బైక్‌లు చోరీ.. పోలీసులకు సవాల్ విసిరిన డేరింగ్ దొంగ.. కానీ
అపరిచితులు మీ ప్రాంతంలో అనుమాస్పదంగా కనిపిస్తే..
ఉత్తర్ ప్రదేశ్ నుంచి రైలు మార్గంలో బెంగళూరుకు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి రైలులో వచ్చి బెంగళూరు నగరానికి వచ్చి అక్కడ ఇళ్లను కొల్లగొడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తాజిమ్ అలీ మరియు సద్దాం అనే ఇద్దరు నిందితులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 186 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు మరియు రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తిలక్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
బెంగళూరులోని గోవిందరాజనగర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లను వెతకడానికి నిందితులు మొదట ఒక బైక్‌ను దొంగిలించారు. ఆ బైక్‌పైనే తిరుగుతూ తిలక్ నగర్‌లో ఒక వ్యక్తి ఇంటి తాళం పగలకొట్టి కొంత నగదు మరియు బంగారాన్ని దోచుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. 3,000కి పైగా సీసీటీవీ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుడ్ మరియు మేరఠ్ జిల్లాల్లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, యూపీ.. సహా పలు రాష్ట్రాల్లో నిందితులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. విలాసాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు.