BigTV English
Advertisement

ED 7th Time Summon to Kejriwal: ఢిల్లీ మధ్యం కుంభకోణం.. ఏడోసారి కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు!

ED 7th Time Summon to Kejriwal: ఢిల్లీ మధ్యం కుంభకోణం.. ఏడోసారి కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు!

ED Sends to 7th Time Summon to Delhi CM Delhi Arvind Kejriwal on Delhi Liquor Case: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మధ్య కుంభకోణం కేసులో ఏడోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు 6సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయినా సరే ఢిల్లీ సీఎం విచారణకు వెళ్లలేదు.


ఇటీవల ఆరోసారీ ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలో ఢిల్లీ సీఎం స్పందించలేదు. ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఈడీ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆప్ నేతలు అంటున్నారు.

Read More: మాజీ గవర్నర్ సత్యపాల్ ఇంటిపై సీబీఐ దాడులు..


మనీలాండరింగ్‌ కేసులో విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాకపోవడం ఈడీ కోర్టుకు వెళ్లింది. ఈడీ ఫిర్యాదుతో ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలో కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉందని ఆ రోజు న్యాయస్థానానికి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అందువల్ల వ్యక్తిగతంగా హాజరుకావడానికి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత విచారణకు తప్పకుండా వస్తానని తెలిపారు. కేజ్రీవాల్ వినతి న్యాయస్థానం అంగీకరించింది. మార్చి 16కు తదుపరి విచారణ వాయిదా పడింది.

ఏడోసారి ఈడీ ఇచ్చిన నోటీసులపై కేజ్రీవాల్ స్పందిస్తారా? విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగానే డుమ్మా కొడతారా? అనేది ఆసక్తిగా మారింది. ఆరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలో కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. మరి ఏడోసారి నోటీసులపై ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది.

Tags

Related News

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Supreme Court: భారత్ లో పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన రాష్ట్రాల సీఎస్‌లు

Anil Ambani: అనిల్ అంబానికి బిగ్ షాక్.. రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, సీబీఐ

Big Stories

×