Shahid Afridi Letter To ICC: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Team vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లలో మాత్రమే టీమిండియా అటు పాకిస్తాన్ రెండు జట్లు తలపడుతున్నాయి. 2008 నుంచి రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు అయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఓ సిరీస్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సంచలన ప్రతిపాదన తీసుకువచ్చారు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi). ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోయిన టీం ఇండియాను హేళన చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఐసిసికి కూడా లేఖ రాసినట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) ముగిసిన తర్వాత ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ తో టీమిండియా ( Team India) సిరీస్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు టీ20 సిరీస్ లో వైట్ వాష్ కాగా… మరో వన్డే సిరీస్ లో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా జట్టును ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడడం అలవాటు చేసుకున్న ఇండియన్ క్రికెటర్లు…. విదేశీ మైదానాలలో ఆడలేక పోతున్నారని హేళన చేస్తున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.
ఫ్లాట్ మైదానాలలో తప్ప టీమిండియా విదేశీ గడ్డలపై అనడం కష్టమేనని బాంబు పేల్చారు. ఇంత బలహీనమైన జట్టును తాను ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. ఇలాంటి సమయంలోనే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాల్సిందేనని సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ఐసీసీకి కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు. వెంటనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఓ సిరీస్ నిర్వహించాలని ఐసీసీకి లేఖ రాసినట్లు కీలక ప్రకటన చేశారు షాహిద్ అఫ్రిది. దుబాయ్ వేదికగా లేదా మరే చోట అయినా సరే … యుద్ధానికి సిద్ధమేనన్నారు. దమ్ముంటే ఐసీసీ బాస్ జై షా దీనిపై స్పందించి… వెంటనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాను డిమాండ్ చేసినట్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఓ సిరీస్ నిర్వహిస్తే… మా వాళ్లు రెచ్చిపోతారన్నారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా… ఈ టోర్నమెంట్ లో టీమిండి అను చిత్తుగా ఓడిస్తానని శపథం చేశారు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !