E-Paper
Advertisement

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!
Advertisement

Sonam Wangchuk: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు దిల్లీలోని ఆస్పత్రి వేదికగా ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ నాయకులను పార్లమెంట్ సభ్యులను కలవడానికి అనుమతించే వరకు.. లేదా ఎంపీలే తన వద్దకు వచ్చే వరకు తన దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు వాంగ్‌చుక్ చేతిరాతతో రాసిన లేఖను ఆయన భార్య గీతాంజలి అంగ్మో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘నేను నా నిరాహార దీక్షను (23వ రోజు) కొనసాగిస్తాను. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై జరిగిన హింసను చూశాక ఈ నిర్ణయం తీసుకున్నాను. యువ నాయకులను పార్లమెంట్ భవన్‌లో ఎంపీలతో కలవడానికి అనుమతించే వరకు లేదా ఆస్పత్రిలో కలిసేందుకు అనుమతించే వరకు నా దీక్ష ఆగదు’ అని ఆయన సంతకంతో కూడిన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిపై త్వరలోనే కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు వాంగ్ చూక్ అన్నారు.

Advertisement

Also Read: ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

దిల్లీలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత సోమవారం ఆందోళన చేశారు. దీనిపై కూడా సోనమ్ స్పందించారు. పోలీసులు, ప్రభుత్వం నుండి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా విద్యార్థులు చూపిన ఓర్పు తన్ను ఎంతో కదిలించిందని ఆయన తెలిపారు. ఇవాళ లేదంటే రేపు పార్లమెంట్ ముందు తమ సమస్యలను చెప్పుకునేందుకు విద్యార్థులను అనుమతించి ఈ వివాదానికి సున్నితంగా పరిష్కారం చూపాలని ప్రభుత్వం, పోలీసులను ఆయన కోరారు. ఆందోళనకారులు గతంలాగే రాబోయే రోజుల్లో కూడా శాంతి, సహనాలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు తన సందేశంలో వాంగ్ చుక్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×