BigTV English

Chinese Man Jackpot: రూ.3 వేలతో.. రూ.796 కోట్ల జాక్‌పాట్..!

Chinese Man Jackpot: రూ.3 వేలతో.. రూ.796 కోట్ల జాక్‌పాట్..!

Chinese Man Bought 133 Lottery Tickets, Hits Rs.796 Crore Jackpot: కొడితే కొట్టాలిరా.. కోట్లు కొట్టాలి.. పడితే పట్టాలిరా జాక్‌పాటే పట్టాలి.. అంటున్న ఆ చైనా కుర్రోడి జోష్‌కు హద్దులే కనిపించడం లేదు. ఈ జోరు, హుషారు వెనుక కారణం లేకపోలేదు.


లాటరీ టికెట్లకు అతను ఖర్చు చేసింది జస్ట్ రూ.3 వేలే. ఆ మొత్తంతో 133 టికెట్లు కొని ఏకంగా రూ.796 కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు. ఇంత అదృష్టం తలుపుతడితే ఎవరికి ఆనందం ఉండదు?

గ్వేఝౌ ప్రావిన్స్‌కు చెందిన 28 ఏళ్ల ఆ వ్యక్తి తనకు లభించిన ప్రైజ్ మనీలో ఐదోవంతు పన్ను రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైతేనేం? చిన్నపాటి వ్యాపారం చేసుకునే అతను తెల్లారేసరికి కోట్లకు అధిపతి అయిపోయాడు.


Read More: వెనుజువెలాలో కూలిన గని.. 14 మంది బలి..

అతను 133టికెట్లు కొనుగోలు చేయగా.. ప్రతి టికెట్ పైనా ఎంతో కొంత మొత్తం లాటరీ రూపేణా లభించడం విశేషం. చైనాలో ఇప్పటివరకు ఇదే అతి పెద్ద జాక్‌పాట్. 2012లో బీజింగ్ వ్యక్తి ఒకరు లాటరీలో రూ.664 కోట్లు గెలుచుకున్నాడు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×