E-Paper
Advertisement

Galgotias University Apology: ఏఐ సమ్మిట్‌లో తప్పుడు సమాచారం.. బహిరంగ క్షమాపణలు కోరిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం!

Galgotias University Apology: ఏఐ సమ్మిట్‌లో తప్పుడు సమాచారం.. బహిరంగ క్షమాపణలు కోరిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం!
Advertisement

Galgotias University Apology: గ్రేటర్ నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న గల్గోటియాస్‌ విశ్వవిద్యాలయం బుద‌వారం జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఒక చైనీస్ రోబోడాగ్‌ను తమ స్వంత ఆవిష్కరణగా ప్రకటించుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ వివాదంపై స్పందించిన వర్సిటీ యాజమాన్యం తాజాగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది.

తమ ప్రతినిధికి సదరు రోబోడాగ్ సాంకేతిక మూలాల గురించి సరైన అవగాహన లేదని కేవలం కెమెరా ముందు ఉన్న ఉత్సాహంతో తప్పుడు సమాచారం ఇచ్చారని వివరణ ఇచ్చింది. సదరు ప్రతినిధికి మీడియాతో మాట్లాడే అధికారం లేకపోయినప్పటికీ అతి ఉత్సాహంతో తప్పుడు సమాచారం ఇచ్చారని వివరించింది. ఈ ఘటనపై విద్యావేత్తలు సాంకేతిక నిపుణుల నుంచి విమర్శలు రావడంతో విశ్వవిద్యాలయం వెంటనే స్పందించింది.

Advertisement

ఏదైనా ఆవిష్కరణను తప్పుగా చిత్రీకరించాలనే ఉద్దేశం తమ సంస్థకు లేదని గల్గోటియాస్ యాజమాన్యం విన్నవించింది. విద్యాపరమైన సమగ్రత పారదర్శకత బాధ్యతాయుతమైన పనితీరు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని తెలిపింది. సంస్థ ప్రతినిధి చేసిన పొరపాటును గుర్తించి నిర్వాహకుల మనోభావాలను గౌరవిస్తూ సమ్మిట్ ప్రాంగణం నుంచి తమ స్టాల్‌ను ఖాళీ చేసినట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో విశ్వవిద్యాలయం తన వివరణను మీడియా ప్రతినిధులకు పంపింది. తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రతినిధిపై అంతర్గత విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. గ్రేటర్ నోయిడాలోని ప్రధాన కార్యాలయం నుంచి వెలువడిన ఈ ప్రకటన ద్వారా తమ విద్యాసంస్థ ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఏఐ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణల పట్ల తాము ఎల్లప్పుడూ నిబద్ధతతో పని చేస్తామని పునరుద్ఘాటించింది.

Advertisement

Read Also: AC tips: సమ్మర్ వచ్చేసింది.. ఏసీని ఆన్ చేసే ముందు ఈ 4 పనులు తప్పక చేయండి!

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

Big Stories

Advertisement
×