E-Paper
Advertisement

BEL Recruitment 2026: సువర్ణవకాశం.. బెల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, మంచి వేతనం.. డోంట్ మిస్

BEL Recruitment 2026: సువర్ణవకాశం.. బెల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, మంచి వేతనం.. డోంట్ మిస్
Advertisement

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కేరళలో పనిచేయడానికి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ విభాగం (HLS&SCB SBU) పరిధిలో ఈ నియామకాలు జరుగుతాయి. మొత్తం 12 ప్రాజెక్ట్ ఇంజినీర్-I ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం నాలుగు సంవత్సరాల బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ వంటి విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2026 నాటికి కనీసం రెండేళ్ల సంబంధిత పారిశ్రామిక అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి సడలింపులు

Advertisement

అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 1, 2026 నాటికి 32 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది. వయస్సు ధ్రువీకరణ కోసం టెన్త్ క్లాస్ మార్కుల మెమో లేదా బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

వేతన వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.40,000 చొప్పున వేతనం లభిస్తుంది. రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000 వరకు గౌరవ వేతనం పెంచుతారు. వేతనంతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం, ఏరియా అలవెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు అదనంగా అందుతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు పనితీరు ఆధారంగా నిర్ణయిస్తారు.

ఎంపిక ప్రక్రియ

Advertisement

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్క్రీనింగ్ చేసిన తర్వాత రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. రాత పరీక్షకు 85 మార్కులు కేటాయించారు. అందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు ఉంటాయి. అకాడమిక్ రికార్డు, రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.

దరఖాస్తు విధానం

ఆసక్తి గల అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 18, 2026న ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమర్పించడానికి మార్చి 9, 2026 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు ప్రింటవుట్ తీసుకోవాలి. తదుపరి ప్రక్రియలో భాగంగా అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలి.

ముఖ్యమైన వివరాలు

కేరళలోని వివిధ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు కొనసాగుతాయి. రక్షణ రంగ సంస్థలో పనిచేయాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.bel-india.in/careers/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హతలను సరిచూసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అఫీషియల్ వెబ్ సైట్: www.bel-india.in/careers/

ALSO READ: Railway Recruitment: రైల్వేలో కొలువుల జాతర.. 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×