India vs Netherlands: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ నెదర్లాండ్స్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడింది టీం ఇండియా. దీంతో ఆరు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 193 పరుగులు సాధించింది. శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఇద్దరు అదిరిపోయే బ్యాటింగ్ తో రెచ్చిపోయారు.. ఈ నేపథ్యంలోనే 193 పరుగులు సాధించింది టీమిండియా. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు సాధిస్తే నెదర్లాండ్స్ విజయం సాధిస్తుంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది టీం ఇండియా. ఈ సందర్భంగా ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా, 193 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో శివమ్ దూబే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 31 బంతులు ఎదుర్కొన్న శివమ్ దూబే ఏకంగా 66 పరుగులు సాధించాడు. ఇందులో 6 సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. 212 స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు డేంజర్ ఆల్ రౌండర్ శివమ్ దూబే. అటు హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక టీమిడియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 28 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సిక్సర్ అలాగే రెండు బౌండర్లు ఉన్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament) అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ టోర్నమెంట్ లో మూడుసార్లు డకౌట్ అయ్యాడు అభి షేక్ శర్మ. మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత నమీబియాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి విఫలమై డక్ ఔట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఇవాళ ముచ్చటగా మూడవసారి కూడా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో డక్ ఔట్ అయ్యాడు. ఇలా టి20 టోర్నమెంట్ లో మూడుసార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు అభిషేక్ శర్మ.
🚨🚨 Shivam Dube is just so so underrated!!
– He delivered in 2024 T20I WC Final, when India needed.
– He delivered in 2025 Asia Cup Final, when India needed.
– He is our 2nd best batter after Ishan at this T20I WC, when scoring runs is tough!
Hero❤️🔥pic.twitter.com/c6jLrqGKdc
— Rajiv (@Rajiv1841) February 18, 2026