Greater Noida Tragedy: ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా పరిధిలోని రబుపురా ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా కనిపించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం స్థానికంగా కలకలం రేపింది.
మృతులను మహేష్ (37), ఆయన భార్య లలిత (35), కుమారులు లడ్డు (11), సాక్షాత్ (3), కుమార్తె మిష్టి (7)గా పోలీసులు గుర్తించారు. ఆహారం విషతుల్యం (ఫుడ్ పాయిజనింగ్) కావడం వల్లే వీరంతా మరణించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రాత్రి సమయంలో ఆ కుటుంబం నూడుల్స్ తిన్నట్లు పొరుగువారులు, మహేష్ తల్లి తెలిపారు. అయితే మరణాలకు గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వస్తేనే స్పష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ
ప్రస్తుతం ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర శాస్త్రీయ పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: ‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!