E-Paper
Advertisement

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!
Advertisement

మన దేశంలో ఎవరినైనా అడిగితే.. పెళ్లిళ్లకో, పండగలకో కొనే బంగారమే మనకు అసలైన ఆపద్భాందవుడు అంటారు. ఒక పదేళ్ల కిందట లేదంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం పెట్టిన పెట్టుబడితో పోలిస్తే.. ఇప్పుడు గోల్డ్ రేట్లు ఎక్కడికో వెళ్లిపోయాయి. అప్పట్లో కొన్న తులం బంగారం ధరతో పోలిస్తే నేడు దాని విలువ రెట్టింపు కంటే ఎక్కువే అయింది. అందుకే కష్టకాలంలో మనల్ని ఆదుకునే విషయంలో బంగారానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.

సరే, మరి డబ్బులు ఉన్నవాళ్లు ఎక్కడ దాచుకుంటే సేఫ్? ఒకవైపు చాలామంది ఇప్పటికీ బ్యాంకుల్లో వేసే ఫిక్స్డ్ డిపాజిట్లను నమ్ముతారు. ఇందులో రూపాయి కూడా పోయే రిస్క్ ఉండదు, ప్రశాంతంగా ఫిక్స్‌డ్ వడ్డీ వస్తుంది. కానీ ద్రవ్యోల్బణం వేగంతో పోలిస్తే ఎఫ్‌డీలో వచ్చే లాభం చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన డబ్బు విలువ కాలంతో పాటు పెద్దగా పెరగదన్నమాట.

Advertisement

మరోవైపు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్ పడిపోతే గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. కానీ దీర్ఘకాలంలో చూస్తే మాత్రం మిగతా అన్నింటికంటే స్టాక్ మార్కెట్లే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టాయని చరిత్ర చెబుతోంది. అయితే సామాన్యులకు మార్కెట్ ఒడిదుడుకులు తట్టుకోవడం కష్టంగా మారుతుంది.

ఇన్వెస్టెమెంట్‌కు ఏది బెస్ట్?

మరి ఏది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్? ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే.. అన్ని గుడ్లూ ఒకే గంపలో పెట్టకూడదు అన్నట్లుగానే.. మన దగ్గర ఉన్న డబ్బును అన్నింటిలోనూ కొద్దికొద్దిగా విభజించి పెట్టుకోవాలి. ఎమర్జెన్సీకి గోల్డ్ ఉండాలి, పర్మినెంట్ సేఫ్టీకి ఎఫ్‌డీ ఉండాలి, భవిష్యత్తులో భారీ లాభాల కోసం స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకుంటేనే మన డబ్బు సురక్షితంగా ఉంటూ మనకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది!

ఇదిగో ఇలా ప్లాన్ చేసుకోండి

Advertisement

మన సంపాదనలోని ప్రతి రూపాయిని ఒకే రకమైన మార్గంలో దాచుకోవడం ఆర్థికంగా ఎంతో ప్రమాదకరం. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు, ద్రవ్యోల్బణం, మరియు అనూహ్యంగా వచ్చే అత్యవసర పరిస్థితులను తట్టుకోవాలంటే మన దగ్గర ఉన్న డబ్బును రకరకాల సురక్షితమైన, లాభదాయకమైన రంగాలలో విభజించి పెట్టుబడి పెట్టడమే ఉత్తమమైన పద్ధతి. దీన్నే ఆర్థిక నిపుణులు ‘అస్సెట్ అలోకేషన్’ (Asset Allocation) అంటారు.

సేవింగ్స్ చాలా ముఖ్యం

జీవితంలో ఎప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేం. ఉద్యోగ భద్రత లోపించడం, హఠాత్తుగా వైద్య ఖర్చులు రావడం లేదా కుటుంబ అత్యవసరాల కోసం కొంత సొమ్ము ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీ నెలవారీ ఖర్చులకు 3 నుంచి 6 నెలలకు సరిపడా డబ్బును సాధారణ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోవాలి.

బంగారాన్ని ఇలా దాచిపెట్టండి

బంగారాన్ని తక్కువ అంచనా వేయొద్దు. బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అత్యుత్తమ ఆర్థిక రక్షణ కవచం. ఆర్థిక సంక్షోభాలు లేదా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం విలువ స్థిరంగా ఉంటుంది లేదా పెరుగుతుంది. నేరుగా గోల్డ్ కాయిన్స్ కొనే బదులు.. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు లేదా Sovereign Gold Bonds (SGB)లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రాసెస్ ఫీజులు, మేకింగ్ ఛార్జీల భారం ఉండదు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయండి

ఆర్థిక మాంద్యం లేదా మార్కెట్ పతనాల నుంచి బయటపడేందుకు స్థిరమైన రాబడినిచ్చే మార్గాలు అవసరం. ఇందుకు మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఎఫ్‌డీలలో డబ్బును దాచుకోవడం ముఖ్యం. వీటి నుంచి నిర్ణీత వడ్డీ రేటు లభిస్తుంది. మార్కెట్లతో సంబంధం లేకుండా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

దీర్ఘకాలిక భద్రత, పన్ను మినహాయింపుల కోసం పీపీఎఫ్ లేదా ఇతర ప్రభుత్వ రహిత పథకాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మీ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని తెస్తాయి. మార్కెట్లు క్షీణించిన సమయంలో కూడా ఇవి మీకు క్రమం తప్పకుండా వడ్డీని అందించగలవు.

Also Read: భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

మ్యూచువల్ ఫండ్స్ & స్టాక్ మార్కెట్

కేవలం ఎఫ్‌డీలు, బంగారం వల్ల ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా దాటడం కష్టం. భవిష్యత్తులో పిల్లల చదువులు, రిటైర్మెంట్ లేదా పెద్ద లక్ష్యాల కోసం పెద్ద మొత్తంలో నిధి ఏర్పాటు చేసుకోవాలంటే మార్కెట్ ఆధారిత పెట్టుబడులు తప్పనిసరి. మార్కెట్ల గురించి పూర్తి అవగాహన లేనివారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా SIP పద్ధతిలో నెలకు కొంత చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. అవగాహన ఉన్నవారు నాణ్యమైన కంపెనీల షేర్లలో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా చక్రవడ్డీ తరహాలో భారీ లాభాలను పొందవచ్చు. దీనివల్ల సుదీర్ఘ కాలంలో ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి అత్యధిక రాబడిని అందిస్తాయి.

Also Read: నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

Tags

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×