E-Paper
Advertisement

Indians in UAE Population: ఏంటీ, గల్ఫ్ దేశాల్లో ఇంత మంది భారతీయులు నివసిస్తున్నారా? ఎక్కడెక్కడ ఎంతమంది అంటే?

Indians in UAE Population: ఏంటీ, గల్ఫ్ దేశాల్లో ఇంత మంది భారతీయులు నివసిస్తున్నారా? ఎక్కడెక్కడ ఎంతమంది అంటే?
Advertisement

Indians in UAE Population: మధ్యప్రాచ్యంలోని గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలలో భారతీయుల పాత్ర అత్యంత కీలకం. ఈ దేశాలు దశాబ్దాలుగా భారతీయులకు ప్రధాన ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. కేవలం నైపుణ్యం లేని కార్మికులే కాకుండా, నేడు ఐటీ, వైద్యం, ఇంజనీరింగ్ వంటి రంగాలలో నిపుణులైన భారతీయులు కూడా గల్ఫ్ దేశాలలో భారీ సంఖ్యలో స్థిరపడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం, వివిధ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య మిలియన్లకు చేరుకుంది.

అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో భారతీయులు నివసిస్తున్నారు. ఇక్కడ సుమారు 3.9 మిలియన్ల మంది భారతీయలు ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా ఉండ‌గా.. ఇక్కడ దాదాపు 2.75 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. కువైట్ లో సుమారు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఖతర్ లో ఫిఫా వరల్డ్ కప్ తర్వాత ఇక్కడ భారతీయుల సంఖ్య పెరిగి 8.3 లక్షలకు చేరింది. ఒమన్లో ఇక్కడ సుమారు 6.62 లక్షల మంది భారతీయులు ఉన్నారు. బహ్రెయిన్లో 3.47 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.

Advertisement

పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇంత భారీ సంఖ్యలో ఉన్న భారతీయుల భద్రత ఇప్పుడు భారత ప్రభుత్వానికి సవాలుగా మారింది. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండటంతో కేంద్ర విదేశాంగ శాఖ నిరంతరం గల్ఫ్ దేశాలలోని రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటోంది. భారతీయులు పంపే విదేశీ ద్రవ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ శాఖ (MEA) గల్ఫ్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ వంటి దేశాలకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే సౌదీ, యూఏఈ, ఒమాన్ వంటి దేశాల నుండి భారత్‌కు విమాన రాకపోకలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

Advertisement

Read Also: Interim Supreme Leader Killed: బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే.. ఖమేనీ వారసుడిని కూడా మట్టుబెట్టిన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు?

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×