E-Paper
Advertisement

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!
Advertisement

Jammu Spy Case: జమ్మూకశ్మీర్‌లో సంచలన ఘటన వెలుగు చూసింది. చైనా గూఢచార సంస్థలకు చెందిన ఏజంట్లతో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను పంచుకున్న తెలుగు మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఒక సీనియర్ ఆర్మీ అధికారి భార్యగా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

నిందితురాలు తెలంగాణకు చెందిన మహిళ కాగా.. ప్రస్తుతం ఆమె జమ్మూలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. ఆమెకు ఎలాంటి దురుద్దేశం లేకపోయినా చైనాకు చెందిన గూఢచారులు తమను తాము అకాడమీషియన్లుగా (విద్యావేత్తలుగా) పరిచయం చేసుకుని ఆమెను మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మొదట్లో పర్యావరణం, జియోపాలిటిక్స్ అంశాలపై ఆర్టికల్స్ రాయించిన ఆ కేటుగాళ్లు.. క్రమంగా రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన విషయాలపై దృష్టి పెట్టేలా చేశారు.

Advertisement

Also Read: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

మరోవైపు సదరు మహిళ రహస్యంగా సున్నితమైన పత్రాలు, ఫోటోలు, ఎలక్ట్రానిక్ డేటాను సేకరించి విదేశీ గూఢచారులకు చేరవేసింది. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా ఈ సమాచారం చైనా తదితర విదేశీ శక్తులకు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎంత సమాచారం బయటకు వెళ్లింది? విదేశీ గూఢచారులతో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడ్డాయి? అనే కోణంలో దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటంతో పోలీసులు పూర్తి వివరాలను ఇంకా గోప్యంగా ఉంచారు.

Advertisement

Also Read: కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

Tags

Related News

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×