E-Paper
Advertisement

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?
Advertisement

Survival Thriller: సముద్రం అడుగున మునిగిపోయిన రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ నౌకను చూడటానికి వెళ్లిన స్నేహితులకు ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. నౌక శిథిలాల మధ్య చిక్కుకుపోవడంతో బయటకు వెళ్లే దారి కనిపించదు. పైకి చేరుకోవడానికి ఆక్సిజన్ కూడా సరిపోదు. మరోవైపు, చుట్టూ తిరుగుతున్న భారీ షార్కులు వాళ్ల కోసం పొంచి ఉంటాయి. సరదాగా మొదలైన సముద్ర యాత్ర కాస్తా ప్రాణాలతో బయటపడడానికి చేసే పోరాటంగా మారుతుంది. ఇలాంటి ఉత్కంఠభరితమైన కథతో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ది లాస్ట్ బ్రీత్’ (The Last Breath). ఈ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

చాలా కాలం తర్వాత కలుసుకున్న కొంతమంది స్నేహితులు కలిసి కరేబియన్ దీవులకు వెళ్తారు. అక్కడ సరదాగా గడపడంతో పాటు సముద్రం అడుగున ఉన్న రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ యుద్ధనౌకను చూడాలని నిర్ణయించుకుంటారు. స్కూబా డైవింగ్‌ లో భాగంగా సముద్రంలోకి దిగిన వాళ్లు నౌక శిథిలాల దగ్గరకు చేరుకుంటారు. మొదట అంతా సాహస యాత్రలా సాగుతుంది. కానీ నౌక లోపలికి వెళ్లిన తర్వాత వాళ్లకు అసలు సమస్య మొదలవుతుంది. తుప్పుపట్టిన ఇనుప భాగాలు, ఇరుకైన దారులు, ఎటు వెళ్లాలో అర్థంకాని గదుల మధ్య వాళ్లు చిక్కుకుపోతారు.

Advertisement

బయటకు వెళ్లే మార్గం కోసం వెతుకుతుండగా, సముద్రంలో భారీ షార్కులు తిరుగుతున్నాయని తెలుస్తుంది. వాటి కంటపడకుండా బయట పడటం అంత సులభం కాదు. మరోవైపు డైవింగ్ కోసం ఉపయోగించే ఆక్సిజన్ కూడా క్రమంగా తగ్గిపోతుంటుంది. ఆలస్యం చేస్తే ఊపిరి అందక ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో స్నేహితులంతా భయంతో వణికిపోతారు. బయట పడేందుకు ఒక మార్గం కనిపించినా, అక్కడ షార్కుల నుంచి ప్రమాదం ఎదురవుతుంది.

నౌక లోపలే ఉండిపోయినా ఆక్సిజన్ అయిపోతుంది. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఆలోచించాల్సి వస్తుంది. ఒకరికి సాయం చేయడానికి మరొకరు ప్రయత్నించినప్పుడు అందరి ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతుంది. సముద్రం అడుగున చిక్కుకున్న స్నేహితులు ఈ ప్రమాదం నుంచి బయటపడగలరా ? షార్కుల బారి నుంచి తప్పించుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలరా ? చివరికి అక్కడి నుంచి ఒక్కరైనా బయట పడ్డారా ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

Advertisement

‘ది లాస్ట్ బ్రీత్’ 2024లో విడుదలైన ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్. సామ్ పాత్రలో కిమ్ స్పియర్‌మన్ (Kim Spearman), నోహ్ పాత్రలో జాక్ పార్ర్ (Jack Parr), బ్రెట్ పాత్రలో అలెగ్జాండర్ ఆర్నాల్డ్ (Alexander Arnold) నటించారు. జోకిమ్ హెదెన్ (Joachim Hedén) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారతదేశంలో జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. సముద్రం, షార్కులు, ప్రాణాల కోసం పోరాటం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన సినిమాలు చూడాలనుకుంటే, ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Tags

Related News

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×