Viral Video: ఎంపీ జయా బచ్చన్‌కు కోపం తన్నుకుంటూ వచ్చింది. తనతో సెల్ఫీ దిగుతావా అంటూ ఆ వ్యక్తిని బయటకు నెట్టేసింది. ఆ తర్వాత చెడా మడా తిట్టేసింది. ఇప్పుడు దీనికి సంబంధించి వార్త హాట్ హాట్‌గా మారింది. అందుకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లో వెళ్తే..
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ బయా బచ్చన్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఈవెంట్లలో కనిపిస్తారు. క్లోజ్‌గా ఉన్నవారితో మాట్లాడుతారు. ఇంకా లేకుంటే పార్లమెంటు సమావేశాల్లో అధికార పార్టీకి రకరకాల ప్రశ్నలు సంధించడం మనం కనిపిస్తుంది. ఆమెతో సెల్ఫీ కోసం వచ్చిన ఓ వ్యక్తిని బయటకు నెట్టేశారు ఎంపీ జయాబచ్చన్.
ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎంపీలు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఓ సమావేశానికి వస్తున్నారు. ఆ సమావేశానికి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కూడా హాజరయ్యారు. అయితే జయా బచ్చన్‌కు చాలా దగ్గరగా ఓ వ్యక్తి వచ్చి ఆమెతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని గమనించిన ఆమె, ఆ వ్యక్తిని సైడుకు తోసేసింది.
ఆ తర్వాత తనలోని కోపాన్ని బయటకు ప్రదర్శించారు. ఆ తర్వాత చెడామడా తిట్టేసింది కూడా. జయ బచ్చన్ ఆ వ్యక్తిని తోసేసి.. ఏం చేస్తున్నావు…ఇదేమిటి అంటూ ప్రశ్నించింది. ఈ సన్నివేశాన్ని అక్కడున్న ఇతర ఎంపీలు చూశారు. ఆమె ఉగ్ర రూపాన్ని చూసి షాక్ అయ్యారు. ఉన్నట్లుండి ఆ సన్నివేశాన్ని చూసిన తోటి ఎంపీలు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ALSO READ: ఆహా.. తందూరి రోటీలో బల్లి, దోరగా వేగి పోయి.. కస్టమర్ షాక్
ఆ సమయంలో ఆర్జేడీ ఎంపీలు మిసా భారతి, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది ఆ వీడియోలో కనిపించారు. బచ్చన్ వ్యవహారశైలితో షాకైన ఆ వ్యక్తికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె భారతి కొన్ని సలహాలు ఇస్తున్నట్లు కనిపించారు. ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చే ముందు ఎంపీలు చిరు నవ్వు నవ్వారు.
సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తిని నెట్టిపారేసిన జయా బచ్చన్..
కాన్‌స్టిట్యూషన్ క్లబ్ గేటు వద్ద ఘటన
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాగానే సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి
కోపంతో అతడిని నెట్టిపారేసిన జయా బచ్చన్
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/SlXuAGcDTx
— BIG TV Breaking News (@bigtvtelugu) August 12, 2025