Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో కప్ కోసం మొత్తం 8 దేశాలు పోటీ పడతాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ దేశాలు ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. ఇక ఈ టోర్నమెంట్ లో టీం ఇండియా తన మొదటి మ్యాచ్ ని ఆతిథ్య యూఏఈ తో సెప్టెంబర్ 10వ తేదీన ఆడనుంది. అలాగే చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ మరోసారి విజయం సాధిస్తుందా..? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటివరకు భారత జట్టు 8 సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు 9 వ సారి ఈ ఆసియా కప్ ని సాధించాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. కాగా ఈ టోర్నీ కోసం టీమిండియా తుది జట్టును ప్రకటించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ఆసియా కప్ లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురుచూసిన అభిమానులు.. ఇప్పుడు టీమిండియా ఆసియా కప్ జట్టును చూసి.. ఇక విజయం తమదేననే ధీమాలో ఉన్నారు.
ఎందుకంటే ఈ టోర్నీ కోసం ఏకంగా ఐదుగురు డేంజర్ బౌలర్లతో బరిలోకి దిగబోతోంది భారత్. బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి ఐదుగురు డేంజర్ బౌలర్లతో ఆసియా కప్ బరిలోకి దిగబోతోంది. ఈ ఐదుగురు బౌలర్లలో బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ గా అర్షదీప్ బరిలోకి దిగబోతున్నాడు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో తన బౌలింగ్ తో ప్రత్యర్థులను వనికించిన మహమ్మద్ సిరాజ్.. ఆసియా కప్ లో కూడా తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. వీరితోపాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వారి స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థుల వికెట్లను కూల్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
Also Read: Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత…రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్
ఇక ఈ టోర్నీకి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉండగా.. గిల్ కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ దుమ్ము రేపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టెస్ట్ కెప్టెన్ గిల్ కి కొందరు భయపడుతుంటే.. సూర్య కుమార్ యాదవ్ ట్రాక్ రికార్డు చూసి మరికొందరి షాక్ అవుతున్నారు. మరోవైపు ఈ ఐదుగురు డేంజర్ బౌలర్లను చూసి ఇతర దేశ ఆటగాళ్లు ఇక ఈ టోర్నీలో తాము గెలవడం అసాధ్యం అనే భావనలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ ఆసియా కప్ కోసం భారత జట్టును ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. భారత జట్టును చూసి ఇతర జట్లలో భయం మొదలైంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.