BigTV English

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Indian Railway Viral Video: రైల్వే ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో కుదరడం లేదు. ప్రయాణీకులు మోతాదుకు మించి రైల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా రద్దీగా ఉన్న రైలు కంపార్ట్‌ మెంట్‌ లో ఓ యువతి  శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. ఆమెకు సాయం చేయాల్సిందిపోయి పక్కనే ఉన్న యువకులు నవ్వుతూ వెకిలి వేషాలు వేశారు. ఆమె బాధపడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రద్దీ ప్రయాణ సమయాల్లో ప్రయాణీకుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రద్దీగా ఉన్న రైలులో ఉన్న అమ్మాయి ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడుతూ కనిపించింది. గాలి కోసం కిటికీ ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. ఉక్కపోతను తట్టుకోలేక, ముఖం మీద నీళ్లు చట్టుకుంటూ కనిపించింది. రైలు కింద ఉన్న యువకులు, ఆమెకు సాయం చేయాల్సింది పోయి, ఎగతాళి చేశారు. ఆమె బాధను చూసి నవ్వుతూ కనిపించారు. ఏ మాత్రం జాలి లేని ఆ యువకులను చూసి నెటిజన్లు నిప్పులు చెరిగారు. ” అమ్మాయి ఊపిరాడక చనిపోయేలా ఉంది. రైలు కోచ్‌ లో స్థలం లేక అవస్థలు పడుతోంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతోంది. ప్లాట్‌ ఫారమ్‌  మీద ఉన్న యువకులు నవ్వుతూ, ఆమెను ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనను ఎవరూ సహించరు” అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశాడు.


స్పందించిన రైల్వే సేవా

ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే సేవాకు ట్యాడ్ చేశాడు. పండుగ సీజన్‌ లో క్రౌడ్ కంట్రోల్ కోసం రైల్వే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి ఎక్కువ క్రౌడ్ ఉన్న స్టేషన్లలో యాక్సెస్‌ ను పరిమితం చేయడంతో పాటు రద్దీ రోజులలో CRPF  భద్రతా దళాలను మోహరించాలని కోరాడు. ఈ వీడియోను చూసి రైల్వే సేవా ప్రతిస్పందించింది. ఆందోళన వ్యక్తం చేసింది. విషయాన్ని మరింత దర్యాప్తు చేయడానికి వివరాలను కోరింది. ” ఈ ఘటన చూసి మేము ఆందోళన చెందుతున్నాము. దయచేసి సంఘటన జరిగిన ప్రదేశం, సంఘటన జరిగిన తేదీ, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను షేర్ చేయండి, మేము ఈఘటనపై ఆరా తీస్తాం” అని తెలిపింది.

నెటిజన్ల ఆగ్రహం

అటు ఘటనను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో అమానవీయ ఘటనగా అభివర్ణించారు. మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “భారతీయులకు సానుభూతి లేదు, నాగరిక ప్రవర్తన లేదు. దేశంలో అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రవర్తన దారుణంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎలా స్పందించాలి అనేది విద్యార్థి దశ నుంచే నేర్పించాల్సిన అవసరం ఉంది” ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.  “ఆ అమ్మాయి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటేకింద ఉన్న వ్యక్తులు నవ్వుతూ, వారి ఫోన్లలో రికార్డ్ చేస్తూ నిలబడి ఉన్నారు? ఇది నిజంగా అమానుషం” అని పేర్కొన్నారు.

Read Also:  కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Related News

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Viral News: అక్కడ పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. గుడిసెల్లోకి పంపి మరీ ఎంకరేజ్ చేసే పెద్దలు!

Big Stories

×