Lizard Inside Tandoori Roti: ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలలో దాడులు నిర్వహిస్తున్నప్పటికీ శుభ్రత విషయంలో యజమానులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారు. తినే ఆహారంలో బొద్దింకలు, పురుగులు, కొన్నిసార్లు ఎలుకలు కూడా కనిపిస్తున్నాయి. బయటి ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ దాబాలో తందూరీ రోటీ తింటున్న కస్టమర్ కు ఊహించని షాక్ ఎదురయ్యింది. రోటీ మధ్యలో ఏకంగా పెద్ద బల్లి కనిపించింది. ఒక్కసారి సదరు వ్యక్తి వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి, సీజ్ చేశారు.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఈ షాకింగ్ ఘటన తాజాగా ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. కాన్పూర్ లోని జీటీ రోడ్ హైవేలో ఉన్న బాజ్ పాయ్ ధాబా తందూరి రోటీలకు బాగా ఫేమస్. ఇక్కడికి రోజూ ఎంతో మంది కస్టమర్లు వచ్చి తంతూరి రోటీలు తింటుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కవగా వస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి ఆ దాబాకు వెళ్లాడు. తందూరి రోటీలకు ఆర్డర్ చేశాడు. వేడి వేడి రోటీలను తింటుండగా షాకింగ్ సంఘటన జరిగింది. రోటీ మధ్యలో బల్లి కనిపించింది. అది చూసి కస్టమర్ మతిపోయింది. రోటీల పొరల మధ్యలో బల్లిని చూసి అవాక్కయ్యాడు. సదరు రోటీ, దానిలోని బల్లిన వీడియో తీశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు
వెంటనే సదరు కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే కాన్పూర్ ఆహార భద్రతా విభాగం అధికారులు ధాబాను తనిఖీ చేశారు. ఇద్దరు సభ్యుల బృందం దాబాలోని కిచెన్ పరిశీలించింది. దాబా అంతటా మురికితో నిండి ఉండటంపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ధాబాలోని తందూరీ పన్నీర్, కూరగాయల శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు. తనిఖీల తర్వాత దాబాను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
कानपुर
➡ग्राहकों के सेहत के साथ खिलवाड़
➡ग्राहक की थाली में निकली छिपकली
➡ढाबे पर खाने के दौरान निकली छिपकली
➡खाने के बाद ग्राहक को हुई उल्टियां
➡कारीगर ने रोटी के साथ सेक दी थी छिपकली
➡रोटी के साथ ही सेक दी थी तंदूर में छिपकली
➡चौबेपुर थाना क्षेत्र के बाजपेई ढाबा रमैया… pic.twitter.com/y8okiVqXJQ— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 9, 2025
Read Also: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!
స్పందించిన పోలీసులు
అటు ఈ ఘటనపై స్థానిక పోలీసులు కూడా స్పందించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఒకవేళ సదరు కస్టమర్లు తమకు ఫిర్యాదు చేస్తే, కచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వారు వీడియోను చూసినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి FIR నమోదు చేయలేదన్నారు. అటు సోను బాజ్ పాయ్ నిర్వహిస్తున్న ధాబా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అంతేకాదు, ఈ ఘటన కచ్చితంగా ఎప్పుడు జరిగిందనే విషయంపైనా క్లారిటీ లేదు. అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బయటి ఫుడ్ తినాలంటేనే భయమేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ధాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: మీ పెంపుడు జంతువులను సింహాలకు ఆహారంగా ఇస్తే.. ట్యాక్స్ నుంచి ఉపశమనం!