Talking In Sleep: చాలా మంది నిద్ర పోయే సమయంలో ఎప్పుడో ఒకసారి కలవరించడమో? మాట్లాడడమో? చేస్తుంటారు. 65 శాతం మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా నిద్రలో మాట్లాడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జనాభాలో 3 నుండి 30 శాతం మంది క్రమం తప్పకుండా నిద్రలో మాట్లాడుతారని చెప్తున్నారు మనస్తత్వవేత్త, నిద్ర పరిశోధకురాలు లుయిగి డి జెన్నారో. రోమ్ లోని సపియెంజా విశ్వవిద్యాలయంలో పని చేసే ఆమె నిద్రలో మాట్లాడ్డం గురించి కీలక విషయాలు వెల్లడించారు. చిన్న పిల్లలు మొదలుకొని యుక్త వయసులో ఉన్నవారి వరకు ఈ సమస్య ఉందంటున్నారు. నిజానికి తాము చెప్పాలనుకున్న విషయాలను ఎవరైనా ఏమనుకుంటారో అని సంకోచించే వారు, నిద్రలో స్వేచ్ఛగా మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు.
ఎక్కువగా అసభ్యకర పదజాలం
2001లో ‘ది కమిటీ ఆఫ్ స్లీప్’ అనే పుస్తకం బయటకు వచ్చింది. దీనిని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వవేత్తలు, కలల పరిశోధకురాలు అయిన డీర్డ్రే బారెట్, మెక్ గ్రెగర్ నిద్రలో మాట్లాడే ఎపిసోడ్ లపై పరిశోధనకు నాయకత్వం వహించారు. కలలు వచ్చిన సమయంలోనే చాలా మంది మాట్లాడుతున్నట్లు డీర్డ్రే బారెట్ గుర్తించారు. నిద్రలో మాట్లాడే మాటలు కలలు, ప్రతికూల భావోద్వేగాలు, కోపం, శారీరక విధులు, ఆహారం, లైంగిక ప్రస్తావనలను తెలియజేస్తుందని ఆమె పాపులర్ సైన్స్ కు వివరించి చెప్పింది. నిద్రలో మాట్లాడే వారిలో ఎక్కువగా అసభ్యకరమైన పదజాలం ఉంటున్నట్లు తెలిపింది. బారెట్ సేకరించిన డేటాలో, నిద్రపోతున్న వ్యక్తులు సాధారణం కంటే ఆరు రెట్లు ఎక్కువగా కబుర్తు చెప్తున్నట్లు తేలింది. నిద్రలో మాట్లాడే సమయంలో కొన్ని మాటలు నిజంగా ఎవరో తిట్టినట్లు అనిపిస్తాయని ఆమె చెప్పింది.
స్లీప్ జర్నల్ పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి!
2017లో స్లీప్ జర్నల్ జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 232 మంది వ్యక్తుల నుంచి 883 రాత్రిపూట మాటలను రికార్డు చేసింది. నిద్రలో ఎక్కువగా మాట్లాడే పదం “వద్దు” అని పరిశోధకులు వివరించారు. ఈ మాటల్లో ఏకంగా 21 శాతం ప్రతికూల మాటలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 10 శాతం తిట్లు ఉన్నట్లు వెల్లడించారు. సాధారణంగా మాట్లాడేందుకు భయపడే చాలా మంది, నిద్రలో సహజంగా, నిజాయితీగా మాట్లాడినట్లు పరిశోధకులు తెలలిపారు.
నిద్రలో ఎందుకు మాట్లాడుతారు?
నిద్రలో మాట్లాడటం అనేది కలలు వచ్చినప్పుడు జరుగుతుందని మనస్తత్వవేత్త ఆర్థర్ ఆర్కిన్ రాసిన స్లీప్ టాకింగ్ అనే పుస్తకంలో రాశారు. బారెట్ ప్రచురించని డేటా విశ్లేషణలో, జంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లు వ్యవహరిస్తారని తెలిపారు. నిద్రలో మాట్లాడేవారి మెదడులో ఏమి జరుగుతుందో శాస్త్రవేత్తలకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ, ఆధారాలు ఉన్నాయి. నిద్రలో మాట్లాడ్డం అనేది ఒక లోపంగా భావిస్తున్నట్లు బారెట్ వెల్లడించారు. నిద్రలో మాట్లాడటం పారాసోమ్నియాస్ తో కూడా సంబంధం కలిగి ఉంటుందన్నారు. పారాసోమ్నియాలు కలిగి ఉండటంలో మన జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తీవ్రమైన సందర్భాల్లో తప్ప, నిద్రలో మాట్లాడటం సాధారణంగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Read Also: మాత్రను మింగకుండా.. నాలుక కింద పెట్టుకోవాలా? అలా చేస్తే ఏమవుతుందంటే?