Viral video: తాళి కట్టు లేకుంటే.. ఇక అంతే.. నిన్ను నమ్మాను.. నన్ను నువ్వు నమ్మావు.. ఇంకేమి తాళి కట్టు ముందు అంటూ ఓ యువతి సౌమ్యంగా ఓ యువకుడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో మాత్రం తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఓ ఘటనగా చెప్పవచ్చు.
అసలు విషయం ఇదే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే, మోసగాడికి కళ్ళెం వేసేందుకు ఏకంగా ఆ యువతి తాళిబొట్టు పట్టుకొని ఇంటికి వెళ్ళినట్లుగా భావించవచ్చు. సదరు యువతి చేతిలో పసుపు తాడు పట్టుకొని సౌమ్యంగా.. ఆ యువకుడిని నిలదీసింది. నన్ను నమ్మావు, నిన్ను నేను నమ్మాను, ఇప్పటికే మనం కలసి పోయాం. ఇంకెందుకు ఇదొక్కటి కట్టేసెయ్ అంటూ ఆ యువతి ప్రాధేయపడుతూ వార్నింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు.
అయితే ఆ యువకుడు మాత్రం సైలెంట్ గా, వింటూనే తదేకంగా చూడడం విశేషం. ఈ ఘటనను మొత్తం రికార్డ్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కాగా సదరు యువతి మాత్రం యువకుడిని నిలదీస్తూ, తాళికట్టమని కోరింది. కానీ ఆ యువకుడు గప్ చుప్ అంటూ అలాగే ఉండిపోయాడు. దీనితో యువతి కాస్త భిన్నంగా కడుతావా లేదా లేకుంటే అన్నీ వి*స్తాను అంటూ మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డ్ కావడం విశేషం.
Also Read: Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!
నేటి సమాజంలో ఎన్నో ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కొందరు అమాయక యువతులు కొన్ని ఘటనల్లో మోసపోతున్న పరిస్థితి. అయితే మరికొందరు పట్టుబట్టి మరీ ప్రేమను పెళ్లి వరకు నడిపిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇది. తనను భార్య కంటే ఎక్కువగా భావించిన యువకుడు తాళి కట్టేందుకు వెనుకడుగు వేయడంపై ఈ యువతి ప్రశ్నించి మరీ తాళి కట్టమని ప్రాధేయపడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.
మోసం చెయ్యడం తెలియని అమ్మాయిలందరు మోసం చేసే అబ్బాయిలకే పడుతారు….
అలానే మోసం చెయ్యడం తెలియని అబ్బాయిలకు మోసం చేసే అమ్మాయిలె దొరుకుతారు… విధి 🤷♂️🤷♂️
అమ్మాయి చివర్లో మాట్లాడే మాటలకి బాధ అనిపిస్తుంది బ్రో నిజంగా.. pic.twitter.com/ni7j6vutw0— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) August 11, 2025
యువతిని మోసం చేయాలని చూసిన వారికి ఇదొక చెంపపట్టుగా కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చేసినదంతా చేసి నేడు సైలెంట్ గా ఉంటావా అంటూ వీడియోలో యువకుడిని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఆ యువకుడు, యువతికి తాళి కట్టాడా లేదా అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.