Shruti Haasan:సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఒకరు దేవాలయాలకు వెళ్తారు.. మరొకరు ఇంకొకరిని కలిస్తే తమ పని జరుగుతుంది అని భావిస్తారు. ఇంకొంతమంది తమకు నచ్చిన రంగుల దుస్తులు వేసుకుంటే ఆ పని జరుగుతుంది అంటారు.. ఇలా ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. ఈ క్రమంలోనే తనకు కూడా ఒక సెంటిమెంట్ ఉందని.. ఆ సెంటిమెంట్ కారణంగా తాను నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా.. తనకు తాను మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తానని చెప్పుకొస్తోంది ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan).
తొలిసారి సెంటిమెంట్ పై ఓపెన్ అయిన శృతిహాసన్..
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లోకేష్ కనగరాజ్ (Kanagaraj) దర్శకత్వంలో.. రజనీకాంత్(Rajinikanth ) హీరోగా నటిస్తున్న కూలీ(Coolie ) చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. నాగార్జున(Nagarjuna ), అమీర్ ఖాన్(Aamir Khan) సౌబిన్ షాహిర్ (Soubin shahir), సత్యరాజ్ (Satyaraj), ఉపేంద్ర (Upendra) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు . అనిరుద్ (Anirudh)సంగీతం అందించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో శృతిహాసన్ కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటోంది. అందులో భాగంగానే తన సెంటిమెంట్ గురించి, తనకు ఇష్టమైన బ్లాక్ కలర్ గురించి చెప్పుకొచ్చింది.
బ్లాక్ కలర్ అంటే అందుకే ఇష్టం – శృతిహాసన్
ఇంటర్వ్యూలో భాగంగా శృతిహాసన్ మాట్లాడుతూ..” నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. చాలా మంది ఈ రంగును అశుభంగా భావిస్తారు. కానీ నాకది శుభం గానే మారిపోయింది. నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాను. నాలో ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ వేసుకోవడం వల్ల నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాను. అంతేకాదు నా స్కిన్ టోన్ కి తగ్గట్టుగా బ్లాక్ కలర్ చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. బ్లాక్ కలర్ దుస్తులు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు మరకలు పడినా.. ఎవరూ అంత త్వరగా ఐడెంటిఫై చేయలేరు. అందుకే నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం” అంటూ తన సెంటిమెంట్ గురించి చెప్పుకొచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
దాదాపు 90 శాతం ఆ కలర్లోనే..
ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో భారీ పాపులారిటీతో పాటు ఫాలోవర్స్ ను కూడా సొంతం చేసుకున్న శృతిహాసన్.. వారిని అలరించడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే రోజుకొక ట్రెండీ ఔట్ఫిట్ తో దర్శనం ఇస్తూ ఉంటుంది. మనం ఒకసారి గమనించినట్లయితే దాదాపు 90% ఫోటోలలో బ్లాక్ కలర్ డ్రెస్ లోనే దర్శనమిస్తూ ఉంటుంది. చాలా వరకు ఈమె ఇలా బ్లాక్ కలర్ లోనే తన అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఈమెను చూసిన నెటిజన్స్ నిత్యం ఈ బ్లాక్ కలర్ ఏంటి అని అందరూ ఆరా తీయగా.. ఇదే ప్రశ్న ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎదురయ్యింది. ఇక దానికామే తన సెంటిమెంట్ అంటూ చెప్పుకొచ్చి అందరి ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది.
ALSO READ:Coolie War 2 films: అక్కడ రెడ్ అలెర్ట్… కూలీ, వార్ 2 సినిమాలకు భారీ నష్టం!