BigTV English

Pak woman: గేమింగ్ యాప్‌లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..

Pak woman: గేమింగ్ యాప్‌లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..

Pak woman: ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ యువతి ఏకంగా దేశం దాటి అక్రమంగా వచ్చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని వారిద్దరు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. వివాహ జీవితం ఆనందంగా సాగిపోతున్న క్రమంలో… నిఘా వర్గాల కంట పడడంతో ఇద్దరూ జైలు పాలయ్యారు.


ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ములాయం సింగ్(25) అనే యువకుడు బెంగళూరులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ గేమింగ్ యాప్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇక్రా జీవని(19) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అదికాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈక్రమంలో ఇక్రా జీవని పాకిస్థాన్ నుంచి నేపాల్ వచ్చేసింది. ములాయం సింగ్‌ కూడా నేపాల్ వెళ్లి.. అక్కడ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు అక్కడే ఉండి.. తర్వాత ఇండియా-నేపాల్ బార్డర్ ద్వారా భారత్‌కి వచ్చేశారు. బెంగళూరుకు వెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. కొత్తగా పెళ్లి చేసుకున్నామని చెబుతూ.. ఇక్రా జీవనిని చుట్టుపక్కల వాళ్లకి ములాయం పరిచయం చేశాడు.


కొన్ని రోజులకు ఇక్రా జీవనికి పాస్‌పోర్ట్ అప్లై చేశాడు. ఈక్రమంలో అధికారులు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడంతో అసలు విషయం బయట పడింది. ఇక్రా జీవని పాకిస్థాన్‌కు చెందిన మహిళగా గుర్తించారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే వారికి ఇళ్లును రెంటుకు ఇచ్చిన గోవింద రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Indians: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. దేశాన్ని వీడిన 1.8 కోట్ల మంది

School: ఆ స్కూల్లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్..

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×