BigTV English

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..<br>బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తో వెయ్యికిపైగా ఛానెళ్లు

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..<br>బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తో వెయ్యికిపైగా ఛానెళ్లు


BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. తమ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నవారికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీస్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. సిటీ ఆన్ లైన్ మీడియా సంస్థతో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఉల్కా టీవీ పేరుతో తీసుకొస్తున్న ఈ సర్వీసులు ఇప్పటికే విజయవాడలో ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఏపీ సర్కిల్ పరిధిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉల్కా టీవీ సర్వీసులు అందుబాటులోకి వస్తే వెయ్యికి పైగా టీవీ ఛానళ్లను వీక్షించే సదుపాయం పొందుతారు. టీవీతో పాటు స్మార్ట్ ఫోన్లలో సైతం ఈ సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నారు.


ఇన్నాళ్లు టీవీ కోసం ఓ కనెక్షన్.. బ్రాడ్ బ్యాండ్ కోసం మరో కనెక్షన్ తీసుకోవాల్సి ఉండేది. ఇకపై ఈ రెండు సేవలు ఒకే కనెక్షన్ తో పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఐపీ టీవీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వీడియో ప్రసారాలను వీక్షించవచ్చు.

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్యాకేజీలు రూ.399తో ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. త్వరలో ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఐపీటీవీ సేవల రంగంలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×