BigTV English

PM Modi AP Tour: ఈ రోజు ఏపీకి ప్రధాని.. సస్పెన్స్ లోనే ఒడిశా సీఎం ఎంపిక..?

PM Modi AP Tour: ఈ రోజు ఏపీకి ప్రధాని.. సస్పెన్స్ లోనే ఒడిశా సీఎం ఎంపిక..?

PM Modi to Attend Chandrababu’s CM Oath Ceremony Today: చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు సమీపంలోని కేసరపల్లి ఐటీపార్కు వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు కూటమి నేతలంతా చంద్రబాబునాయుడిని శాసనసభాపక్షనేతగా ఎన్నుకుంటారు. అనంతరం గవర్నర్ ను కలిసి కేబినెట్ జాబితాను అందజేసి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.


కాగా.. సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని పీఎంఓ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఉదయం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయి.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడలోని కేసరపల్లి ఐటీపార్కు వద్ద ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రానున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొని.. ఒడిశాకు బయల్దేరుతారు.

Also Read: చంద్రబాబు చెప్పిన పొలిటికల్ పాలన ఇదేనా?


గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భువనేశ్వర్ కు వెళ్తారు ప్రధాని. ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారం కూడా రేపే జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఆ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత.. ఒడిశాలో అధికారం మారింది. కానీ.. ముఖ్యమంత్రి ఎంపికపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో.. ఆయనకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ లేదు. మరి ఎవరిని ఎంపిక చేయాలన్న బాధ్యతను కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ లకు అప్పగించింది బీజేపీ.

Tags

Related News

Marwari Community: అసలు మార్వాడీలు ఎవరు? వారి వ్యాపార రహస్యం ఏంటి?

India’s Iron Dome: శత్రువుల గుండెలు అదిరేలా.. భారత్ గేమ్ ఛేంజర్.. మిషన్ సుదర్శన చక్ర ఎలా పని చేస్తుందంటే?

Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఇక లేరు

Artificial Rain: డ్రోన్లతో వర్షమంటూ ప్రయోగం.. ఎగిరాయి కానీ, అంతా శూన్యం.. ఎక్కడంటే?

Delhi News: ఢిల్లీలో ఘోర ఘటన.. గోడ కూలి ఐదుగురు మృతి.. మరికొందరు శిథిలాల కిందే!

Draupadi Murmu: సెల్యూట్ ముర్ము జీ.. జోరు వానలోనూ అమరవీరులకు నివాళి.. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా!

Big Stories

×