Ind vs Pak: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే.. ఆ మజా వేరే ఉంటుంది. అలాంటిది ఆసియా కప్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడితే.. కోట్ల వర్షం కొరవడం గ్యారెంటీ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే వచ్చే నెలలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో 10 సెకండ్ల యాడ్ కు 16 లక్షలు ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఒక్క మ్యాచ్ నేపథ్యంలో కోట్ల వర్షం కురవడం గ్యారంటీ అని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో తలపడనున్న పాకిస్తాన్ వర్సెస్ ఇండియా
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం తర్వాత.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య అసలు మ్యాచ్ జరగకూడదని… చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ ఐసీసీ నిర్ణయం ప్రకారం టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిపేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14వ తేదీన మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కాకుండా…. ఒకవేళ ఈ రెండు జట్లు సెమీఫైనల్ కు వెళితే.. రెండుసార్లు తలపడే ఛాన్సులు ఉంటాయి. అలా కాదని ఫైనల్ దాకా వెళ్తే మూడుసార్లు కూడా.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 14వ తేదీన జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో… ఇప్పటికే యాడ్ కు సంబంధించిన రేట్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 10 సెకండ్ల యాడ్ కు ఏకంగా 16 లక్షలు ఇవ్వాలని.. ఐసీసీ నిర్ణయం తీసుకుందట. అంటే దాదాపు ఈ మ్యాచ్ పూర్తయ్యే లోపు కోట్ల వర్షం కురవడం గ్యారంటీ. అదే సమయంలో బయట యాడ్స్, బెట్టింగ్స్, స్పాన్సర్ షిప్ ఇలా అనేక రూపాల్లో డబ్బులు వచ్చే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అలాగే ఉంటుంది. అయితే యుద్ధం తర్వాత.. ఈ మ్యాచ్ జరగడం… అందరిలోనూ ఉత్కంఠతను రేపుతోంది.
ఆసియా కప్ 2025 షెడ్యూల్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. టి20 ఫార్మేట్ లో జరిగే ఈ టోర్నమెంట్ లో మొత్తం 19 మ్యాచులు నిర్వహించనున్నారు. ఇక టోర్నమెంటును యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నారు. ఆగస్టు 19వ తేదీన టీమ్ ఇండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే
Ad slots for Asia Cup 2025 are going as high as 16 lakh for just 10 seconds, with India–Pakistan clashes pulling the steepest rates. Sony is rolling out premium TV and digital bundles.
So now no chest-thumping patriotism, or “sindoor in the bloodstream”? pic.twitter.com/3jeoWa0BYS
— Vipin Tiwari (@Vipintiwari952) August 16, 2025