BigTV English

Anil Sunkara: 1 – నేనొక్కడినే… దూకుడు రికార్డులన్నీ కొడదాం అని ప్లాన్ చేశాం

Anil Sunkara: 1 – నేనొక్కడినే… దూకుడు రికార్డులన్నీ కొడదాం అని ప్లాన్ చేశాం

Anil Sunkara: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ లో అనిల్ సుంకర ఒకరు. సినిమా అంటే ఎంతో ప్యాషన్ నిర్మిస్తారు. ఇటువంటి నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. తీసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించటం లేదు. అంచనాల మధ్య వచ్చిన సినిమాలు ఫెయిలవుతున్నాయి.


కొన్ని సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించకపోయినా కూడా కొన్ని సంవత్సరాలు తర్వాత ఆ సినిమాలు చూస్తే ఇంత గొప్ప సినిమాని మనం ఆదరించలేకపోయామా అనే బాధ కలుగుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలా మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు నేనొక్కడినే. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. జనవరి 10న విడుదలైన ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. సినిమా మొదటి షో పడిన వెంటనే డిజాస్టర్ టాక్స్ సొంతం చేసుకుంది.

దూకుడు రికార్డు కొడదాం 


నేనొకడిని సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. అయితే ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉండేవి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు లుక్స్ విడుదలైనప్పుడు చాలామంది ఖచ్చితంగా అద్భుతమైన సక్సెస్ కొట్టబోతున్నాము అని అనుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ కూడా కట్ చేసి కొన్ని థియేటర్స్ లో ప్లే చేయడానికి రెడీ చేశారు. అయితే ఈ ట్రైలర్ ప్లే చేయడానికి అంటే ముందు నిర్మాత అనిల్ సుంకర కు ఒక ఫోన్ వచ్చింది. ఈ ట్రైలర్ కానీ మనం ఇప్పుడు వదిలినట్లయితే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని ఒక వ్యక్తి చెప్పారట.

దానికి భయపడటం వలన సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. ఆ సినిమా ట్రైలర్ విడుదల చేయలేకపోవటమే సినిమాకు మైనస్ గా మారింది. ఒకవేళ సినిమా ట్రైలర్ విడుదల చేసి ఉంటే ఆడియన్స్ ఒక మైండ్ సెట్ తో ఆల్రెడీ థియేటర్ కు వచ్చేవాళ్ళు. అలా చేయకపోవడం వలన హీరోకి ఒక జబ్బు ఉంది అని తెలియగానే చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. అప్పటికే దూకుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాం కాబట్టి నేనొక్కడినే సినిమాతో కూడా రికార్డులన్నీ కొడతామని అనుకున్నాము అని అనిల్ సుంకర రీసెంట్ గా తెలిపారు.

ఎప్పటికీ స్పెషల్ ఫిలిం 

ఇక నేనొక్కడినే సినిమా విషయానికి వస్తే సుకుమార్ బెస్ట్ వర్క్ అని కొంతమంది చెబుతుంటారు. ఇప్పటికీ కూడా ఆ సినిమాని చూస్తూ ఎంత గొప్ప సినిమా తీశాడో అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతారు. సినిమా అప్పుడు సక్సెస్ కాకపోయినా కూడా ఇప్పటికీ ఆ సినిమాకి ఒక స్థాయి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ పంచాయితీ, మరో కీలకమైన మీటింగ్

Related News

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ పంచాయితీ, మరో కీలకమైన మీటింగ్

Koratala Siva: దేవర 2 సినిమా లేనట్లేనా, నాగచైతన్యకు కథ చెప్పిన కొరటాల

Social Look: దిశా పటానీ అందాల అరాచకం.. రెడ్‌ డ్రెస్‌లో రెజీనా హాట్‌ లుక్స్‌

Ram Gopal Varma: మీ లాబ్రడార్, హస్కీలతో వీధి కుక్కలకు పెళ్లి చేయండి.. డాగ్‌ లవర్స్‌కి ఆర్జీవీ మరో కౌంటర్‌..

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Big Stories

×