BigTV English

Mudragada Padmanabham: ముద్రగడ దారెటు..? ఆయన మాకొద్దన్న రెడ్డి నేతలు..!

Mudragada Padmanabham: ముద్రగడ దారెటు..? ఆయన మాకొద్దన్న రెడ్డి నేతలు..!

Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు మథనపడుతున్నారు. తమ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు టీడీపీపై అనసవరంగా నోరు జారామని లోలోపల బాధపడుతున్నారు. దగ్గరి వాళ్లతో చెప్పుకుని మనసులోని బాధను దించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరైతే ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి. అలాంటి వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒకరు.


ముద్రగడ పేరు చెబితే చాలు కాపు ఉద్యమ నేత అనే పేరు ఠక్కున వినబడేది. ఇదంతా ఒకప్పటి మాట. ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారాయన. అంతేకాదు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తామని శపథం చేశారు. లేకుంటే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆవేశం లో నోరు జారారు పెద్దాయన.

ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు తారుమారయ్యాయి. ముద్రగడ మాత్రం మాట తప్పలేదు. తన పేరును మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు గెజిట్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకీ ముద్రగడను రెడ్డి సంఘాలు అంగీకరిస్తాయా? ఇవే ప్రశ్నలు ఏపీలోని చాలామంది ప్రజలను వెంటాడుతున్నాయి. ఆయన మా కులంలోకి వచ్చేందుకు ఏమాత్రం అంగీకరించమని అంటున్నారు అనపర్తికి చెందిన కొందరు రెడ్డి నేతలు.


Also Read: ఈసారి రాజు గారు వంతు.. జగన్‌తోపాటు కొందరు అధికారులు..

ఈ విషయంలో ముద్రగడకు అనుమతి ఇచ్చిందెవరని ప్రశ్నించారు అనపర్తి ప్రాంతానికి చెందిన మాజీ సర్పంచ్ కర్రి రామారెడ్డి. ముద్రగడ విషయంలో మా సంఘాలు నోరు ఎత్తలేదని, ఆయన చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ముద్రగడ మా కులంలో కలవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మనసులోని మాట బయటపెట్టారు. మాకు అపఖ్యాతి రాకుండా ఉండాలంటే ఆయన దూరంగా ఉండడమే మంచిదన్నారు. దీనిపై రెడ్డి సంఘాలు స్పందిస్తాయని కోరారు. మరి ముద్రగడ దారెటున్నది అసలు ప్రశ్న. రాబోయే రోజుల్లో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.

Related News

AP News: ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులు? డైలీ ఆ దేశానికి కాల్స్.. NIA కస్టడీలోకి ఇద్దరు తీవ్రవాదులు

JanaSena Party: జనసేనలోకి రీఎంట్రీ.. జేడీ లక్ష్మీనారాయణకు కీలక బాధ్యతలు?

AP Rains: ఏపీలో 3 రోజులు దంచుడే.. ఈ 10 జిల్లాల్లో భారీ వర్షాలు

Prakasam district: దారుణం.. తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

Babu Pawan Lokesh: శౌర్యం, శాంతం, సమరం.. RRR లాగా.. SSS

Jagan: పులివెందుల రిజల్ట్.. జగన్ కామెంట్స్ వెనుక

Big Stories

×