BigTV English

Marwari Community: అసలు మార్వాడీలు ఎవరు? వారి వ్యాపార రహస్యం ఏంటి?

Marwari Community: అసలు మార్వాడీలు ఎవరు? వారి వ్యాపార రహస్యం ఏంటి?

“మార్వాడీ గో బ్యాక్” అనే పేరుతో ఇటీవల సోషల్ మీడియాలో హడావిడి నడుస్తున్న విషయం తెలిసిందే. మార్వాడీల వల్ల స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించడమేంటని కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మార్వాడీల చరిత్ర ఏంటి..? వ్యాపారాల్లో వారు ఎలా విజయవంతం అయ్యారు? ఇతరులు అసూయపడేలా వ్యాపారంలో రాణించడం వారికి ఎలా సాధ్యమైంది? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.


ఎవరీ మార్వాడీలు..?
మార్వాడీలు భారతదేశంలోని రాజస్థాన్‌ లోని మార్వార్ ప్రాంతానికి చెందినవారు. వ్యాపారం చేయడంలో సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లి రాణించగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. అగర్వాల్, మహేశ్వరి, జైన్ వంటి ఇంటిపేర్లతో వీరు ప్రసిద్ధి చెందారు. వివిధ రకాల ఉత్పత్తులతో వ్యాపారం చేయడమే కాదు, వడ్డీవ్యాపారంలో కూడా వీరు అందెవేసిన చేయి. బేసిక్ గా రాజస్థాన్ కి చెందినవారే అయినా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి పెద్ద నగరాలకు వెళ్లి అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని వీరు విస్తరించారు.

పరస్పర సహకారం..
మార్వాడీ కమ్యూనిటీ ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ముందుంటుంది అంటారు వారిని దగ్గర్నుంచి చూసిన వారు. ఆలోచనలు, పరిచయాలను పంచుకోవడమే కాదు, ఆర్థిక సాయంలో కూడా ఒకరికొకరు ఎంతో అండగా ఉంటారు. విన్ విన్ పాలసీతో ఒకరికొకరు సాయం చేసుకుని ఇద్దరూ వ్యాపారంలో లాభపడతారు. కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెడుతుంటే మరొకరు అసూయ పడరు, ఆ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యేలా తనకున్న పరిచయాలతో సాయపడతారు.


వృథాకు దూరం..
రిస్క్ తీసుకోవడం మార్వాడీల వద్దే నేర్చుకోవాలని అంటారు. టెక్నాలజీలో కూడా వారు అప్ డేట్ గా ఉంటారు. చిన్న దుకాణంతో మొదలు పెట్టి తర్వాత దాన్ని పెద్దగా విస్తరిస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు కూడా వారు వెనకాడరు. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే, వెంటనే రెండోదానికి షిఫ్ట్ అవుతారు. మార్వాడీలు పెద్దగా డబ్బు వృథా చేయరు. వ్యాపారాల్లో లాభం వస్తే వెంటనే లగ్జరీగా బతికేందుకు ఆలోచించరు. ఆ లాభాన్ని అదే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి మరింత విస్తరించడం కోసం ప్రయత్నిస్తారు. బయటనుంచి రుణాలు తీసుకుంటే అనుకున్న సమయంకంటే ముందుగానే తీర్చేయడానికి ఇష్టపడతారు. రుణాలు లేకుండా వ్యాపారాలు కొనసాగించడం వారికి అలవాటు. అంతే కాదు, కస్టమర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి వారు మరింత కష్టపడతారు. తక్కువ టైమ్ లో ఎక్కువ లాభం సంపాదించాలనుకోరు. ఎక్కువకాలం తమ వ్యాపారం నిలబడేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కువగంటలు కష్టపడేందుకు మార్వాడీలు సిద్ధంగా ఉంటారు. అంకిత భావం కూడా వారి విజయ రహస్యం అని అంటారు. ఒకే రకమైన కుటుంబ వ్యాపారాలే కాకుండా విభిన్న వ్యాపారాలను నడిపేందుకు వారు ప్రయత్నిస్తారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతారు. ఇటీవల కాలంలో చాలామంది మొబైల్ ఫోన్ల వ్యాపారంలోకి దిగారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా పట్టణాల్లో మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ దుకాణాలను మార్వాడీలే నడుపుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో..
రాజస్థాన్‌లో కరువు వచ్చినప్పుడు నిజాంల కాలంలో మార్వాడీలు హైదరాబాద్‌కు వలస వచ్చారని అంటారు. ఆ తర్వాత వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా విస్తరించారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గణనీయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు మార్వాడీలు. ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో మార్వాడీల వ్యాపారాలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. ఈ నిరసన రాజకీయ మలుపు తిరిగింది. బీజేపీ నేతలు మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ తో కలసి కొన్ని పార్టీలు మార్వాడీలపై తప్పుడు ముద్ర వేస్తోందని వారు అంటున్నారు. అటు మార్వాడీలు కూడా తమకు రక్షణ కావాలంటూ స్థానిక ప్రభుత్వాలను ఆశ్రయిస్తున్నారు. భారతీయులుగా తెలంగాణ సహా ఇతర ఏ ప్రాంతంలో అయినా వ్యాపారం చేసుకునే హక్కు తమకు ఉంది అని వారు అంటున్నారు.

Related News

India’s Iron Dome: శత్రువుల గుండెలు అదిరేలా.. భారత్ గేమ్ ఛేంజర్.. మిషన్ సుదర్శన చక్ర ఎలా పని చేస్తుందంటే?

Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఇక లేరు

Artificial Rain: డ్రోన్లతో వర్షమంటూ ప్రయోగం.. ఎగిరాయి కానీ, అంతా శూన్యం.. ఎక్కడంటే?

Delhi News: ఢిల్లీలో ఘోర ఘటన.. గోడ కూలి ఐదుగురు మృతి.. మరికొందరు శిథిలాల కిందే!

Draupadi Murmu: సెల్యూట్ ముర్ము జీ.. జోరు వానలోనూ అమరవీరులకు నివాళి.. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా!

Big Stories

×