BigTV English

MLA Kuna Ravi: MLA కూన రవి నన్ను శారీరకంగా వేధిస్తున్నాడు.. కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీళ్లు..

MLA Kuna Ravi: MLA కూన రవి నన్ను శారీరకంగా వేధిస్తున్నాడు.. కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీళ్లు..

MLA Kuna Ravi: ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై లోలుగు కేజీవీబీ ప్రిన్సిపల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రిన్సిపల సౌమ్య ఆరోపించారు. అడ్మిషన్ల కోసం మీటింగ్ అంటూ.. రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తున్నారని ఆమె వాపోయారు. ఇందుకు సంబంధించిన నైట్ టైమ్ వీడియో కాల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఎమ్మెల్యేపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు..

ఎమ్మెల్యే అనుచరులు సైతం నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె బోరు ఏడ్చసాగారు. ప్రిన్సిపల్ సౌమ్య కన్నీరుమున్నీరు అవుతున్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక.. తమ్ముడు కాల్ చేసి జరిగిన సమాచారం అంతా చెప్పుకుంటూ విలపించారు. ఎమ్మెల్యే మాట వినలేదనే తనను.. వేరే ప్రాంతానికి ట్రాన్స ఫర్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.


ALSO READ: Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. చచ్చిపోతా

‘ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. భరించలేకపోతున్నాను.. నా వల్ల కావడం లేదు. ఎందుకు..? ఆయన నన్ను ఇంత టార్గెట్ చేస్తున్నాడు..? వేధిస్తున్నాడు.. పై అధికారులు కూడా ఆయన చెప్పిందే వింటున్నారు. నాకు న్యాయం జరగడం లేదు. సమాజంలో ఇంత గౌరవంగా బతుకుతున్నా.. నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు..? వేధింపులకు నేను శారీరకంగా లొంగడం లేదని.. మరింత టార్చర్ చేస్తున్నారు.. ఇక నాకు చచ్చిపోవాలని ఉంది.. నేను ఆత్మహత్య చేసుకుంటా..’ అని ప్రిన్సిపల్ సౌమ్య బోరున విలపించారు.

ALSO READ: ఇంటర్, డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే 62వేల జీతం.. ఇంకెందుకు ఆలస్యం..?

వైసీపీ సంచలన ట్వీట్..

కూన రవి కుమార్ వ్యవహారంపై సోషల్ మీడియాలో వైసీపీ సంచలన పోస్టులు పెడుతోంది. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బెదిరిస్తూ.. ఎమ్మెల్యే తన శాడిజం చూపుతున్నారని వైసీపీ ట్వీట్ చేసింది.

Related News

AP News: ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులు? డైలీ ఆ దేశానికి కాల్స్.. NIA కస్టడీలోకి ఇద్దరు తీవ్రవాదులు

JanaSena Party: జనసేనలోకి రీఎంట్రీ.. జేడీ లక్ష్మీనారాయణకు కీలక బాధ్యతలు?

AP Rains: ఏపీలో 3 రోజులు దంచుడే.. ఈ 10 జిల్లాల్లో భారీ వర్షాలు

Prakasam district: దారుణం.. తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

Babu Pawan Lokesh: శౌర్యం, శాంతం, సమరం.. RRR లాగా.. SSS

Big Stories

×