Rohit Sahni – Marina: బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మెరీనా అబ్రహం సాహ్ని(Marina Abraham Sahni) ఒకరు. అమెరికా అమ్మాయి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె మరో బుల్లితెర నటుడు రోహిత్(Rohit) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా 2017 వ సంవత్సరంలో వీరి వివాహం ఎంతో అంగరక వైభవంగా జరిగింది అయితే వివాహం తర్వాత కూడా పలు ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈ జంట బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు.
ఆడబిడ్డకు జన్మనిచ్చిన మెరీనా..
ప్రస్తుతం రోహిత్ పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ జంట అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. వీరు పెళ్లి జరిగిన ఎనిమిది సంవత్సరాలకు తల్లితండ్రులుగా ప్రమోట్ అయ్యారని తెలుస్తుంది ఇటీవల మెరీనా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో పాటు తన బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ విషయాన్నీ కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్న ఈమె తనక బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా చాలా ఆలస్యంగా తెలియజేశారు.
తెయారా సాహ్ని…
ఈ దంపతులు గత కొద్ది రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు (Baby Girl)జన్మనిచ్చారు అయితే తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని తమకు పాప పుట్టింది అంటూ పాపకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా తెయారా సాహ్ని (Teiara Sahni )అని నామకరణం కూడా చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాప చాలా క్యూట్గా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కావడంతో అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న ఈ దంపతులకి అమ్మాయి పుట్టడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇదివరకే మెరీనాకు రెండుసార్లు గర్భ స్రావం అయిన విషయాన్ని కూడా పలు సందర్భాలలో బయటపెట్టారు. 8 సంవత్సరాల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారిన నేపథ్యంలో వీరి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తమకు పాప పుట్టిందనే విషయాన్ని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ కూతురి ఫోటోలను రివీల్ చేశారు. ఇక ఈ జంట బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. మెరీనా కొన్ని వారాల తర్వాత హౌస్ నుంచి బయటకు రాగా, రోహిత్ మాత్రం ఫినాలే వరకు హౌస్ లో కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేశారు . ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బిగ్ బాస్ కారణంగానే ప్రస్తుతం రోహిత్ సినిమా అవకాశాలను అందుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read: Big Tv Kissik Talks: అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ.. అసలు విషయం చెప్పిన సౌమ్యరావు!