Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత ఎల్ గణేశన్ మరణించారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. గతవారం తలకు తగిలిన గాయంతో ఆసుపత్రిలో ఆయన చేరారు.
అప్పట్నుంచి స్పృహ కోల్పోయిన గణేశన్, తిరిగి కోలుకోలేకపోయారు. ఆయన అంత్యక్రియలు శనివారం టీ నగర్‌లో నిర్వహించనున్నారు. గణేశన్ భౌతికాయాన్ని సందర్శనార్థం శనివారం ఆయన ఇంటి వద్ద ఉంచనున్నారు. సాయంత్రం అంత్యక్రియలు జరపనున్నట్లు తెలుస్తోంది.
1945 ఫిబ్రవరి 16న తమిళనాడులోని తంజావూర్‌లో గణేశన్ జన్మించారు. తండ్రి-సోదరులు ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు కలిగి ఉండటంతో చిన్న వయసులో రాష్ట్రీయ స్వయం సంఘ్-RSS సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యారు గణేశన్. 1970లో ఫుల్‌టైమ్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా మారారు.
దాదాపు 20 ఏళ్లపాటు నాగర్‌కోయిల్, మధురై ఇతర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సంఘ్‌కి సేవలందించారు. అక్కడి నుంచి 1991లో బీజేపీలో చేరారు. తమిళనాడు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ పదవిలోకి వచ్చిన తమిళనాడులో బీజేపీ వ్యవహారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
ALSO READ: డ్రోన్లతో వర్షమంటూ ప్రయోగం.. ఎగిన తర్వాత అంతా శూన్యం
10 ఏళ్ల తర్వాత గణేశన్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. రెండేళ్లు జాతీయ ఉపాధ్యక్షులలో ఒకరిగా పని చేశారు కూడా. 2006-09 మధ్య గణేశన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
2021, ఆగస్టు 27న మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన గణేశన్.. దాదాపు రెండేళ్లపాటు పని చేశారు. అదే సమయంలో 2022 జూలై నుంచి నవంబర్ వరకు బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్‌గా సేవలందిస్తున్న ఆయన, గాయంతో ఆసుపత్రి పాలయ్యారు.
బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల్లో లోతుగా పాతుకుపోయినప్పటికీ, తమిళనాడులోని రెండు ద్రవిడ పార్టీలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. సాహిత్యపరమైన ఆసక్తి కారణంగా అతను దివంగత మాజీ సీఎం, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధితో మంచి సంబంధాలు ఉన్నాయి.
నాగాలాండ్ గవర్నర్ తిరు లా గణేషన్ మరణం బాధాకరమన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దేశభక్తుడిగా, జాతి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా గుర్తుంటారని అన్నారు. తమిళనాడు అంతటా బీజేపీని విస్తరించడానికి ఆయన కృషి మరువలేమన్నారు. గణేషన్ కుటుంబ సభ్యులకు నప్రగడ సానుభూతి తెలియజేశారు.