Megastar Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఆ సమస్యను తీర్చే పెద్ద మనుషులు లేకుండా పోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా దాసరి నారాయణరావు గారు నేనున్నాను అంటూ అన్ని సమస్యలను క్లియర్ చేసేవాళ్ళు. లాయర్ లా కాకుండా జడ్జి లాగా అందరికీ న్యాయం జరిగేలా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్దమనిషి స్థానాన్ని తీసుకోవడానికి ఎవరూ రెడీగా లేరు.
గత కొన్ని రోజులుగా సినిమా కార్మికులు తమ యొక్క వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి క్లారిటీ వస్తుందని చాలామంది ఎదురు చూశారు. కానీ ఎటువంటి క్లారిటీ రాలేదు. ఒకవైపు నుంచి నిర్మాతలు తగ్గడం లేదు. మరోవైపు నుంచి యూనియన్ లీడర్లు అసలు తగ్గడం లేదు. ఇది రోజురోజుకీ పెద్ద సమస్యగా మారిపోతుంది. ఈ తరుణంలో మరోసారి అందరూ కలిసి ఈ ఇష్యూను చిరంజీవి దృష్టికి మరోసారి తీసుకెళ్లనున్నారు.
చిరంజీవి ఇంట్లో మీటింగ్
ప్రస్తుతం అధికారికంగా ఇండస్ట్రీకి పెద్దమనిషి చిరంజీవి అని చెప్పకపోయినా కూడా కొన్ని విషయాల్లో ఆయన నిలబడిన విధానం ఖచ్చితంగా గర్వించదగినది. సినిమా కార్మికుల ఇష్యూ గురించి చిరంజీవి గతంలో త్వరగా పరిష్కరించుకోమని చెప్పారు. లేకపోతే తాను రంగంలోకి దిగుతాను అని మాట్లాడారు. ఇక ప్రస్తుతం అదే జరుగుతుంది. రేపు చిరంజీవి ఇంట్లో కీలకమైన మీటింగ్. నిర్మాతలతో పాటు ఫెడరేషన్ నాయకులు ఈ సమావేశం లో పాల్గొంటారు. రేపు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగిన తర్వాత ఇష్యూ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
షూటింగ్స్ బంద్
సినిమా కార్మికుల వేతనాల విషయంలో ఈ చర్చలు జరుగుతున్న కారణంగా హైదరాబాదులో పూర్తిస్థాయిలో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇలా షూటింగ్ లాగిపోవడం వలన తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఆల్రెడీ రిలీజ్ డేట్స్ ఇచ్చిన సినిమాలు ఇప్పుడు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అనుకున్న డేట్ కి షూటింగ్ జరగలేదు కాబట్టి రిలీజ్ డేట్ కు ఆ సినిమా రావడం కష్టం. సినిమా షూటింగ్ జరిగిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటే పరవాలేదు. కానీ షూటింగ్ దశలో ఉన్న సినిమాలకు మాత్రం పెద్ద ఇబ్బంది అని చెప్పాలి. అయితే మెగాస్టార్ తో మీటింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇది అంత ఈజీగా తేలే యవ్వారం కూడా కాదు అనేది కొంతమంది అభిప్రాయం.
Also Read: Koratala Siva: దేవర 2 సినిమా లేనట్లేనా, నాగచైతన్యకు కథ చెప్పిన కొరటాల