CSK Biryani Restaurant : సాధారణంగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చెన్నై కి అంత క్రేజ్ ఉండటానికి మహేంద్ర సింగ్ ధోనీనే కారణం అని అందరికీ తెలిసిందే. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఫ్యాన్స్ ఉండటానికి విరాట్ కోహ్లీ.. ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ ఇలా ఎవ్వరికీ నచ్చిన ఆటగాళ్ల జట్టుకు ఆయా ఆటగాళ్లను బట్టి క్రేజ్ ఉంటుంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండు జట్లు మాత్రమే 5 సార్లు విజేతలుగా నిలిచాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 2025 సీజన్ లో మాత్రమే టైటిల్ గెలుచుకుంది. టైటిల్ గెలవకున్నా కానీ ఆ జట్టుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ.
Also Read : Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
CSK బిర్యానీ.. సోషల్ మీడియాలో వైరల్..
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. CSK బిర్యానీ షాపు పెట్టాడు ఓ వ్యక్తి. దానికి ఏకంగా ధోనీ ఫోటో కూడా ఏర్పాటు చేశాడు. CSK రెస్టారెంట్ అంటే చాలా మంది నిజంగా ధోనీ రెస్టారెంటేమో అనుకున్నారంట కొత్తగా వెళ్లిన వారు. కానీ ఆ రెస్టారెంట్ వ్యక్తి ధోనీ మీద, CSK మీద అభిమానంతో ఈ పేరుతో రెస్టారెంట్ ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే CSK కి విజిల్ పోడు ఆర్మీ అనే అధికారిక అభిమాన సంఘం ఉంది. ఇది 2016 లో స్థాపించారు. ఈ అభిమాన సంఘం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దాదాపు 33 మిలియన్లకు పైగా అనుచరులతో ఐపీఎల్ లో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ అనే చెప్పవచ్చు.
CSK అభిమానుల హంగామా
అభిమానులు జట్టు ఆటలను చూడటానికి స్టేడియాలకు వస్తారు. టీవీలో లేదా ఆన్ లైన్ లో కూడా మ్యాచ్ లను చూసి.. జట్టుని ప్రోత్సహిస్తారు. గెలిచినప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. హంగామా చేస్తారు. జట్టు విషయాలను సెలబ్రేట్ చేసుకుంటారు. దేశంలో ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ లు జరిగినా.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు హంగామా చేస్తుంటారు. మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. అలాగే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసినప్పటికీ అభిమానులు మాత్రం.. ఓడింది కేవలం ఈ ఒక్కసారి మాత్రమే. ఆర్సీబీ గెలిచింది ఒక్కటే సారి.. కానీ చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది 5 సార్లు అంటూ ఫ్యాన్స్ కి ఆర్సీబీ అభిమానులకు కౌంటర్ ఇచ్చారు. ఐపీఎల్ 2025లో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల మధ్య పెద్ద వారే జరిగింది.