BigTV English

Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!

Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!

Neeraj Chopra’s wife : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తన స్నేహితురాలు హిమానీ మోర్ ని 2025 జనవరి 16న సిమ్లాలో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్-హిమానీ వివాహం జరిగింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా యూరప్ లో శిక్షణ పొందుతున్నాడు. నీరజ్ తో పాటే హిమానీ కూడా అక్కడే ఉన్నారు. అయితే హిమానీ రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్ ను వదులుకున్నట్టు సమాచారం. ఇక ఈ విషయాన్ని ఎవ్వరో చెప్పింది కాదండోయ్. స్వయంగా ఆమె తండ్రినే వెల్లడించడం విశేషం.


Also Read : Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

 టెన్నిస్ మాత్రమే ఆడుతా.. 


హిమానీ మోర్ తండ్రి చాంద్ మోర్ డైనిక్ భాస్కర్  తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “నీరజ్ చోప్రాతో పెళ్లి తరువాత హిమానీ తన టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు చెప్పింది. అమెరికాలో రూ.1.5కోట్ల క్రీడలకు సంబంధించిన ఉద్యోగ ఆఫర్ ను కూడా తిరస్కరించింది. హిమానీ ఇప్పుడు తన సొంత వ్యాపారం పై దృష్టి పెట్టింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది” అని చెప్పారు. ప్రస్తుతం నీరజ్ శిక్షణా, డైట్, బ్రాండ్, ఎండార్స్ మెంట్స్, క్రీడా ఈవెంట్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యూరప్ లో ఉన్న హిమానీ.. త్వరలోనే తన సొంత వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. హర్యానాలోని లార్సౌలీలో 1999లో జన్మించిన హిమానీ మోర్ నాలుగో తరగతి చదువుతున్నప్పుడు టెన్నీస్ ఆడటం ప్రారంభించారు. అయితే కుటుంబం మాత్రం బాక్సింగ్, రెజ్లింగ్, కబడ్డీ పై దృష్టి పెట్టాలని సూచించింది. హిమానీ మాత్రం టెన్నిస్ ఆడుతానని స్పష్టం చేశారు. 

Also Read :  Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తరువాత అన్నింటికి గుడ్ బై.. 

ఓవైపు టెన్నీస్ ఆడుతూ.. మరోవైపు చదువు కొనసాగించారు. సోనిపట్ లో స్కూల్ విద్య పూర్తి చేసి.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ లో పట్టా అందుకున్నారు. 2018లో హిమానీ ప్రొఫెషనల్ టెన్నిస్ లో ఆరంగేట్రం చేశారు. అదే ఏడాది కెరీర్ లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్ లో 27వ ర్యాంకు సాధించారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఫ్రాంక్లిన్ పియర్స్ విశ్వ విద్యాలయం నుంచి స్పోర్ట్స్ అండ్ ఫిట్ నెస్ మేనేజ్ మెంట్ అండ్ హెచ్ఆర్ మేనేజ్ మెంట్ లో హిమానీ మోర్ డబుల్ ఎంబీఏ చేశారు. అంతేకాదు.. సౌత్-ఈస్టర్న్ లూసియానా విశ్వ విద్యాలయం నుంచి స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ  పూర్తి చేశారు. యూఎస్ లో ఉన్నప్పుడు మహిళా టెన్నిస్ జట్టు మేనేజర్, అసిస్టెంట్ కోచ్ గా కూడా పని చేశారు. పెళ్లి అనంతరం అన్ని వదిలేసిన హిమానీ.. సొంత వ్యాపారం పై దృష్టి సారించారు. 

Related News

Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

Ind vs Pak: 10 సెకండ్లకు 16 లక్షలు… ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ తో కోట్ల వర్షం !

Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Harry Brook: క్రికెట్ లోనే తొలిసారి… సరికొత్త షాట్ కనిపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇది చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×