Big Tv Kissik Talks: బుల్లితెర నటి, సౌమ్య రావు (Sowmya Rao)తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తనకు సంబంధించిన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉపయోగించడమే కాకుండా.. కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు(Plastic Surgery) కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది ఇప్పటికే తమ అందాన్ని పెంపొందించుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు.
షూటింగ్లో గాయపడిన సౌమ్యరావు…
ఈ క్రమంలోనే సౌమ్యరావు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే వార్త వినపడుతూనే ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష సౌమ్యరావును ఇదే విషయం గురించి ప్రశ్నించారు. మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? నిజమేనా? అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సౌమ్య రావు సమాధానం చెబుతూ తాను అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే లేజర్ ట్రీట్మెంట్ మాత్రం తీసుకున్నానని ఈమె అసలు విషయం తెలియజేశారు. ఓ షూటింగ్లో భాగంగా అనుకోని ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదం జరగడంతోనే తను లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అని తెలిపారు.
ప్లాస్టిక్ సర్జరీ కాదు, లేజర్ ట్రీట్మెంట్..
ఓసారి షూటింగ్లో భాగంగా తాను హీటర్ మీద పడ్డాను తద్వారా తన మొహంపై చిన్న ఘాటు పడిందని దానికోసం తాను లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను తప్ప ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదని, అలాంటివి తనకు ఇష్టం ఉండదని సౌమ్య రావు తెలిపారు. అందాన్ని పెంపొందించుకోవడం కోసం తాను ఇలాంటివి ఉపయోగించుకోనని నాకు నచ్చినట్టుగా గడుపుతాను, మనస్ఫూర్తిగా నచ్చినవి తింటానని వెల్లడించారు. ఇక సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురవడంతో మనల్ని ఎవరొచ్చి డేట్స్ అడుగుతారు వర్ష అంటూ సమాధానం చెప్పారు. ఒకవేళ స్పెషల్ సాంగ్లో చేసే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న కూడా ఎదురయింది.
స్పెషల్ సాంగ్ లో నటిస్తారా?
స్పెషల్ సాంగ్ మరి బోల్డుగా లేకపోతే నటిస్తాను అంటూ సమాధానం చెప్పారు. ఇక ఈమె తెలుగులో పలు సీరియల్స్ తో పాటు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం సీరియల్స్ చేయకపోయినా ఢీ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో, తమిళంలో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి సందడి చేశారు. ఇక ప్రస్తుతం తనకు ఏదైనా సీరియల్స్ లేదా షోలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని అయితే ఇదివరకు తనకు ఎన్నో అవకాశాలు వచ్చిన కొంతమంది ఆ అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు అంటూ కూడా సంచలన విషయాలను బయటపెట్టారు.
Also Read: Big Tv kissik Talks Show: రష్మి కంటే అనసూయ బెటర్.. సౌమ్యరావు షాకింగ్ కామెంట్స్!