E-Paper
Advertisement

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలు.. హుగ్లీ నదిలో ప్రధాని మోదీ ప్రయాణం, లాహిరి లాహిరి లాహిరిలో

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలు..  హుగ్లీ నదిలో ప్రధాని మోదీ ప్రయాణం, లాహిరి లాహిరి లాహిరిలో
Advertisement

Bengal Elections 2026: బెంగాల్‌లో ఈసారి అధికారంలోకి రావాలని తనవంతు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. జాతీయ స్థాయి నేతలు ఒకరి తర్వాత మరొకరు ప్రచారం తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ హుగ్లీ నదిలో పడవ ప్రయాణం చేశారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలు

Advertisement

బెంగాల్‌ శాసనసభకు రెండో విడత ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. మరో విపక్ష బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. తమదైన మాటల శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. ఈ విషయంలో బీజేపీ ముందు ఉందనే చెప్పాలి.

తాజాగా శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరంద్ర మోదీ కోల్‌కతాలోని హుగ్లీ నదిలోని పడవలో ట్రావెలింగ్ చేశారు. పడవ నడిపే వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. అదే సమయంలో కెమెరా చేత పట్టుకుని హుగ్లీ నది అందాలను క్లిక్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Advertisement

హుగ్లీ నదిలో ప్రధాని మోదీ ప్రయాణం, మార్నింగ్ వాక్‌లో కాసేపు ప్రధాని ముచ్చట్లు

మార్నింగ్ పడవ షికారు తర్వాత ఎక్స్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. బెంగాల్ సంస్కృతిలో హుగ్లీ నది ముడిపడి ఉందన్నారు. బెంగాలీల జీవితాల్లో గంగానదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆ జలాలు ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకు వెళ్తున్నాయంటూ ప్రస్తావించారు. ఈ ఉదయం కాసేపు హుగ్లీ నది తీరంలో గడిపినట్లు రాసుకొచ్చారు.

పడవ నడిపేవారు, అక్కడికి మార్నింగ్ వాక్‌కు వచ్చేవారితో కాసేపు ముచ్చటించారు ప్రధాని. పడవ నడిపేవారి శ్రామికశక్తిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. చారిత్రాత్మక విద్యాసాగర సేతు-హౌరా వంతెనను చాలా దగ్గరగా చూడటం ఆనందంగా ఉందని ప్రస్తావించారు.

ALSO READ: అమర్ నాథ్ యాత్ర 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా!

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 23న జరగ్గా, రెండో దశ 29న జరగనుంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశముందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు తొలి విడత పోలింగ్ తమకు అనుకూలంగా ఉందంటున్నారు. మే నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

Related News

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

Big Stories

Advertisement
×