E-Paper
Advertisement

2వేలకు పైగా పాటలు.. జాను ఒక్క పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

2వేలకు పైగా పాటలు.. జాను ఒక్క పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?
Advertisement

Janu lyri:జాను లిరి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ షోలలో తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ కి అద్భుతమైన డాన్స్ చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా “శెనిగిచెన్ల నిలబడి” అనే పాటను ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో రాజేష్ తో కలసి డాన్స్ అదరగొట్టేసింది. పైగా ఈ పాటకు యూట్యూబ్లో 163 మిలియన్లకు పైగా వ్యూస్ లభించి ఈ పాట ట్రెండింగ్ లో నిలిచింది. ముఖ్యంగా పైరాల పాలపుత ఓ బావ, చిలక నీకు సిరలు తెస్తి వంటి జానపద పాటలకు తన డాన్స్ స్టెప్పులతో విపరీతమైన ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది.

ఒక్కో పాటకు జాను లిరి రెమ్యూనరేషన్..

అలా డాన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సొంతం చేసుకున్న ఈమె.. గతంలో వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తనపై అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేయొద్దని.. వాటి వల్ల తాను మానసికంగా కృంగిపోతున్నాను అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకుతో కలిసి ఉన్న తనకు ఇతరులతో సంబంధాలు అంటగట్ట వద్దని కోరుతూ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని చెప్పి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరొకరితో పెళ్లికి సిద్ధమైనట్లు కూడా ప్రకటించింది. ఇక ఇప్పుడు డాన్సర్ గా మళ్ళీ తన పనిలో తాను బిజీ అయిపోయిన ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఒక్కో పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో చెప్పుకొచ్చింది.

రూ. 1500 నుండి రూ.20 వేల వరకు..

Advertisement

ఇంటర్వ్యూలో భాగంగా జాను లిరి మాట్లాడుతూ..” నేను ఇప్పటివరకూ సుమారుగా రూ.2 వేలకు పైగా ఫోక్ సాంగ్స్ చేశాను. నా కెరియర్ ప్రారంభంలో ఈవెంట్లలో పాల్గొని డాన్స్ చేసినప్పుడు రూ.1500 ఇచ్చేవాళ్ళు. అలా నా తొలి రెమ్యూనరేషన్తో నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. కొన్ని కొన్ని సందర్భాలలో వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం ఒక్కో పాటకు సుమారుగా రూ.20 వేల నుండి రూ 50 వేల వరకు తీసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది జాను లిరి. మొత్తానికైతే రూ.1500 తో మొదలైన ఆమె ప్రయాణం నేడు రూ.20వేల వరకు చేరుకుందంటే ఇక ఆమెకు ప్రేక్షక ఆదరణ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. నేడు పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. టీవీ షోలలో కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

also read:NBK 112: బాలయ్య -కొరటాల కాంబోలో హీరోయిన్ ఫిక్స్?

జాను లిరి వ్యక్తిగత జీవితం..

Advertisement

జాను వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే..బెల్లంపల్లి కి చెందిన టోనీ కిక్ అనే వ్యక్తిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు. ఆ బాబుకి లిరి అని నామకరణం కూడా చేశారు. ఇద్దరు కలిసి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చేవారు. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా ఇద్దరి మధ్య విభేదాలు, మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక జాను కొడుకుతో ఒంటరిగా ఉంటూ తన కెరీర్ను కొనసాగిస్తోంది. గత ఏడాది సింగర్ దిలీప్ దేవగన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×