E-Paper
Advertisement

పెళ్లి వద్దని చెప్పడం కంటే.. హత్య చేయడమే తేలిక.. విచారణలో సియా గోయల్ వెల్లడి

పెళ్లి వద్దని చెప్పడం కంటే.. హత్య చేయడమే తేలిక.. విచారణలో సియా గోయల్ వెల్లడి
Advertisement

Pune Murder: పూణే బిజినెన్ మాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. హత్యారోపణలపై సియా గోయల్ ను విచారిస్తున్న క్రమంలో ఆమె చెప్పిన సమాధానం విని.. దర్యాప్తు అధికారులు సైతం నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. కాబోయే భర్తను చంపేబదులు.. ఇష్టం లేని పెళ్లి వద్దని ఇంట్లో చెప్పొచ్చు కదా అని దర్యాప్తు అధికారులు సియాను ప్రశ్నించారు. అయితే ఫ్యామిలీతో చెప్పి నవంబర్ లో జరిగే పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం కంటే.. కేతన్ అగర్వాల్ ను చంపడమే సులభమని తనకు అనిపించినట్లు ఆమె సమాధానం ఇచ్చారు.

పెళ్లి వద్దని చెప్పి తన కుటుంబ సభ్యులను బాధపెట్టడం తనకు ఇష్టం లేదని సియా గోయల్ విచారణలో చెప్పినట్లు పూణే రూరల్ పోలీసు వర్గాలు తెలిపాయి. అందుకే తనకు కాబోయే భర్తను చంపాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆమె చెప్పారని పేర్కొన్నాయి. కేతన్ హత్యలో భాగస్వామి అయిన సియా ప్రియుడు చేతన్ చౌదరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన కాల్ రికార్డింగ్స్ ను పరిశీలిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ వారిద్దరు 2,000 పైగా కాల్ సంభాషణలు జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏకంగా 238 గంటల వారిద్దరు మాట్లాడుకున్నట్లు పేర్కొన్నాయి.

Advertisement

Also Read: అమెజాన్ సూపర్ సేల్.. అత్యంత చౌకగా ఫ్రిజ్‌లు.. సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్!

మరోవైపు సియా గోయల్ తల్లిదండ్రులు మాత్రం తామెప్పుడు చేతన్ చౌదరిని కలవలేదని అన్నారు. కనీసం ఇప్పటివరకూ అతడితో మాట్లాడలేదని పేర్కొన్నారు. అటు కేతన్ అగర్వాల్ విగ్గు వాడటం వల్ల సియా అసంతృప్తికి గురై హత్య చేసిందన్న ప్రచారాన్ని మృతుడి తండ్రి విశాల్ అగర్వాల్ కొట్టిపారేశారు. విగ్గు విషయం అమ్మాయితో పాటు ఆమె కుటుంబానికి ఎప్పటినుంచో తెలుసని అన్నారు. తన బిడ్డ విగ్గు ధరిస్తాడన్న విషయం నిజమేన్న ఆయన.. దీనిపై సియా గోయల్ లో ఎలాంటి అయిష్టం లేదన్నారు. నిశ్చితార్థం జరగడానికి ముందు నుంచే విగ్గు గురించి సియాకు, వారి ఫ్యామిలీకి తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read: మీ త్యాగం వృథా కాదు.. మెరుగైన జీవితం కల్పిస్తా.. వెలిగొండ నిర్వాసితులకు సీఎం హామీ

Related News

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

Big Stories

Advertisement
×