E-Paper
Advertisement

యాపిల్ సంచలన నిర్ణయం.. ఆ రెండు ప్రాసెసర్లు పక్కనబెట్టి.. నేరుగా M7తో భారీ స్కెచ్!

యాపిల్ సంచలన నిర్ణయం.. ఆ రెండు ప్రాసెసర్లు పక్కనబెట్టి.. నేరుగా M7తో భారీ స్కెచ్!
Advertisement

Apple M7 Chip: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తమ కొత్త ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌ల విషయంలో ఎప్పుడూ ఒక పక్కా ప్లానింగ్‌తో వెళ్తుంది. అయితే ఈసారి చిప్‌సెట్ వ్యూహంలో మాత్రం ఒక పెద్ద మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మార్చిలో అత్యంత శక్తివంతమైన M5 ప్రో, M5 మ్యాక్స్ ప్రాసెసర్‌లను తీసుకొచ్చిన యాపిల్.. ఇప్పుడు తమ తదుపరి తరం హై-ఎండ్ చిప్‌ల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

మారిన యాపిల్ వ్యూహం:

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తమ సాంప్రదాయ చిప్‌సెట్ లాంచ్ సిరీస్‌ను కాస్త మార్చనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో రావాల్సిన M6 ప్రో, M6 మ్యాక్స్ ప్రాసెసర్‌లను పూర్తిగా స్కిప్ చేయాలని కంపెనీ భావిస్తోంది. వాటి స్థానంలో నేరుగా తదుపరి తరం M7 ప్రో, M7 మ్యాక్స్ చిప్‌లను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి పెట్టింది. యాపిల్ సిలికాన్ చరిత్రలో ప్రో, మ్యాక్స్ మోడల్స్ లేకుండా ఒక సిరీస్‌ను దాటవేయడం ఇదే తొలిసారి కానుంది.

2027లో M7 సిరీస్ ఎంట్రీ:

Advertisement

ఈ సరికొత్త M7 ప్రో, M7 మ్యాక్స్ ప్రాసెసర్‌లు 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి మునుపటి కంటే అత్యంత అధునాతన కంప్యూటింగ్, గ్రాఫిక్స్ పవర్‌తో రానున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో డివైజ్‌లలోనే నేరుగా రన్ అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను, భారీ గ్రాఫిక్స్ అవసరమయ్యే టాస్క్‌లను ఇవి చాలా సులువుగా హ్యాండిల్ చేయగలవని తెలుస్తోంది.

Also Read: సినిమా లవర్స్‌కు పూనకాలే.. సోనీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ హోమ్ థియేటర్ సిరీస్ లాంచ్!

బేసిక్ M6 చిప్ వస్తుంది:

Advertisement

అయితే యాపిల్ M6 సిరీస్‌ను పూర్తిగా పక్కన పెట్టడం లేదు. సాధారణ వినియోగదారుల కోసం బేసిక్ M6 చిప్‌ను ఈ ఏడాది చివర్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ను ఎంట్రీ-లెవల్ మ్యాక్ డివైజ్‌లతో పాటు సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌లో వాడనున్నారు. అంటే కేవలం ప్రొఫెషనల్స్ వాడే ప్రో, మ్యాక్స్ వెర్షన్లు మాత్రమే M6 సిరీస్‌లో ఉండవు.

M5 సిరీస్ హవా:

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాక్‌బుక్ ప్రో (2026) మోడల్స్ M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో నడుస్తున్నాయి. ఇవి 3nm టెక్నాలజీ, 18-కోర్ CPUతో అద్భుతమైన స్పీడ్‌ను అందిస్తున్నాయి. అయినప్పటికీ.. మారుతున్న టెక్నాలజీ కాలంలో AI సామర్థ్యాలను మరింత పెంచడం కోసం యాపిల్ ఒక అడుగు ముందుకేసి, M6 ప్రో వెర్షన్లను కాదని నేరుగా M7 సిరీస్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

Also Read: 17600mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్‌తో 8849 Tank 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×