E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఖైదీలు విడుదలయ్యాక కూడా వదలని ఆఫీసర్లు.. ఫోన్ నెంబర్లు తీసుకుని మరీ..?

ఖైదీలు విడుదలయ్యాక కూడా వదలని ఆఫీసర్లు.. ఫోన్ నెంబర్లు తీసుకుని మరీ..?
Advertisement

Telangana Prisons: రాష్ట్రంలోని జైళ్లు పరివర్తనా కేంద్రాలుగా మారాయి. వేర్వేరు నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారితోపాటు రిమాండ్​ ఖైదీల్లో మార్పు తీసుకు రావటంలో గణనీయ ఫలితాలను సాధిస్తున్నాయి. ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని అధికారులు ఆ ఉచ్ఛులో నుంచి బయటకు తీసుకొస్తున్నారు. విడుదలైన తరువాత కూడా ఫాలో అప్​ సేవలు అందిస్తూ మరోసారి డ్రగ్స్​ జోలికి పోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ జైళ్ల శాఖకు గర్తింపు..

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ సంస్కరణలు అమలు చేస్తున్న జైళ్ల శాఖగా మన తెలంగాణ జైళ్ల శాఖ గుర్తింపును సాధించింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు, నేరాల నియంత్రణ సంస్థ, టర్న్ యువర్ కన్సర్న్ ఇన్​ టూ యాక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంజాబ్ జైళ్ల శాఖ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ‘డ్రగ్స్, హెచ్ఐవీ అండ్ ప్రిజన్ హెల్త్ రెస్పాన్సెస్’ జాతీయ సదస్సులో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రత్యేక ఆహ్వానంపై హాజరై ప్రజంటేషన్​ ఇచ్చారు.

అడ్మిషన్​ సమయంలో..

Advertisement

వేర్వేరు నేరాలకు పాల్పడి అరెస్ట్​ అయి జైళ్లకు వస్తున్న ఖైదీలకు ప్రవేశ సమయంలోనే ఆయా జైళ్ల అధికారులు డ్రగ్ స్క్రీనింగ్​ పరీక్షలు జరుపుతున్నారు. గత సంవత్సరం జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు 12,675 మంది ఖైదీలకు అడ్మిషన్​ ఇచ్చే సమయంలో టెస్టులు జరిపారు. దీంట్లో 4,200 మంది ఖైదీలకు డ్రగ్స్​ అలవాటు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా 1,563మంది ఖైదీలు గంజాయికి అలవాటు పడినట్టుగా తేలింది. కల్తీ కల్లుకు 815మంది బానిసలుగా మారినట్టు వెల్లడైంది. 160మంది సెడెటీవ్ మాత్రలు, 72మంది సెడెటీవ్​ ఇంజక్షన్లు, 60మంది ఎండీఎంఏ, 40మంది మెథాంఫెటమైన్​, 33మంది ఎల్ఎస్డీ బ్లాట్స్​, 31మంది కొకైన్​, 50మంది ఓపీఎం డ్రగ్స్​ తీసుకుంటున్నట్టుగా తేలింది.

Also read: ఫ్యూచ‌ర్ సిటీ పెట్టుబ‌డిదారులకు కేటీఆర్ వార్నింగ్‌! అక్క‌డ ఫార్మాసిటీనే ఉంటుంది!

అవగాహన కార్యక్రమాలు..

Advertisement

వీరందరికీ హైదరాబాద్, చర్లపల్లి, నిజామాబాద్​, సంగారెడ్డి సెంట్రలో జైళ్లు, చంచల్​ గూడ మహిళల ప్రత్యేక జైల్లోని ‘నివృత్తి।’ డీ అడిక్షన్​ సెంటర్ల ద్వారా అధికారులు పునరావాస సేవలు అందించారు. ఇందులో భాగంగా 4,100 వ్యక్తిగత కౌన్సెలింగ్ సమావేశాలు, 1,150 ఫాలోఅప్ కౌన్సెలింగ్లు, 507 సైకోఎడ్యుకేషన్-గ్రూప్ సెషన్లు, 317 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి క్రమంగా ఖైదీల్లో మార్పు తీసుకొస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే విడుదలైన ఖైదీలకు ఫాలో అప్​ సేవలు అందిస్తున్నారు.

సక్రమ మార్గంలో జీవిస్తున్నారా..?

విడుదలయ్యే సమయంలో ఖైదీల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న అధికారులు వారితో రెగ్యులర్​‌గా మాట్లాడుతున్నారు. మార్పు తెచ్చుకుని సక్రమ మార్గంలో జీవిస్తున్నారా? లేదా? అన్న దాంతోపాటు డ్రగ్స్​‌కు దూరంగా ఉంటున్నారా? లేదా? అన్న వివరాలను తెలుసుకుంటూ ఫాలో అప్​ సేవలు అందిస్తున్నారు. ఈ చర్యలు ఖైదీల్లో మార్పు తీసుకొస్తున్నట్టుగా జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. నివృత్తి డీ అడిక్షన్​ సెంటర్ల ద్వారా ఇప్పటివరకు 15,645మంది ఖైదీలకు సేవలు అందించినట్టు చెప్పారు.

Also read: మీ త్యాగం వృథా కాదు.. మెరుగైన జీవితం కల్పిస్తా.. వెలిగొండ నిర్వాసితులకు సీఎం హామీ

Related News

KTR: వికారాబాద్ అడవులను మోదీకి రాసిచ్చారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

Advertisement Policy: జీవో నెంబర్ 84లో సంచలన సవరణలు చేసిన తెలంగాణ సర్కార్.. అవి ఇవే..!

నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

Jana Sena: ప్రజారాజ్యం పాత కాపులకు పవన్ కల్యాణ్ పిలుపు.. తెలంగాణలో జనసేన నెక్ట్స్ ప్లాన్ ఇదే..?

Pre-Primary Education: ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల ధమాకా.. అదనంగా మరో 2,769 స్కూళ్లు..!

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్, ఉరుములు-మెరుపులతోపాటు

లైక్‌ల కోసం ఆశపడి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువత, ఏకంగా 456 మంది ఏం చేశారంటే..

Big Stories

×